హారర్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హారర్ కామెడీ కథతో తెరకెక్కే సినిమాలకు మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. టాలీవుడ్ లో ఇప్పటికే ఈ న్రేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే హిందీలోనూ ఇప్పటికే చాలా సినిమాలు హారర్ బ్యాక్డ్రాప్ లో వచ్చాయి. ఇక ఈఏడాది హారర్ కామెడీగా వచ్చిన శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు నటించిన స్త్రీ 2 బాక్సాఫీస్ వద్ద భారీ భారీ విజయాన్ని అందుకుంది. స్త్రీ మొదటి పార్ట్ మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈసినిమా సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే స్త్రీ 2 సినిమా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత చాలా హారర్ కామెడీ సినిమాలు తీయబోతున్నట్లు బాలీవుడ్ దర్శకనిర్మాతలు అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో ఇటీవలే భూల్ భూలయ్యా ఫ్రాంచైజీ మూడవ భాగం కూడా విడుదలైంది, అయితే ఈ రెండు చిత్రాలను బీట్ చేసేలా మరో హారర్ చిత్రం త్వరలో రాబోతోంది. ఈ హర్రర్ సినిమా పేరు ‘కటనార్: ది వైల్డ్ సోర్సెరర్’.
సౌత్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే ఇప్పుడు మరో క్రేజీ మూవీ రానుంది. కటనార్: ది వైల్డ్ సోర్సెరర్ అనే టైటిల్ తో మలయాళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జయసూర్య, ప్రభుదేవా మరియు అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.. కొంతకాలం క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌ని జనాలు బాగా ఆదరించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని వార్తలు వస్తున్నాయి.
భయానక ప్రపంచంలో ఇంతకు ముందు ఎవరూ చూడని ప్రపంచానికి మిమ్మల్ని తీసుకెళ్తానని ‘కటనార్: ది వైల్డ్ సోర్సెరర్’ మూవీ టీమ్ చెప్తుంది. ఈ సినిమాలో అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్‌ని ఉపయోగించారు. ఈ సినిమా షూటింగ్ కోసం దాదాపు 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెట్ వేసినట్లు సమాచారం. ఇదొక్కటే కాదు, ఈ సినిమా విశేషమేమిటంటే, ఈ చిత్రం ఒకటి కాదు రెండు కాదు, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ, బెంగాలీ, కన్నడ, చైనీస్, ఫ్రెంచ్, కొరియన్, ఇటాలియన్ వంటి 14 భాషల్లో విడుదల కానుంది. రష్యన్, ఇండోనేషియా, జపనీస్ లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా బడ్జెట్ 90 కోట్లు. రోజిన్ థామస్ దర్శకత్వం వహించిన ‘కటనార్: ది వైల్డ్ సోర్సెరర్’ దక్షిణాదిలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.