Anupama Parameswaran: జక్కన్న కాళ్ళు మొక్కిన హీరోయిన్ అనుపమ.. కారణం ఏంటంటే

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.

Anupama Parameswaran: జక్కన్న కాళ్ళు మొక్కిన హీరోయిన్ అనుపమ.. కారణం ఏంటంటే
Anupama
Follow us

|

Updated on: Aug 14, 2022 | 5:55 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). చిన్న పాత్రే అయిన తన నటనతో అభినయంతో ఆకట్టుకుంది అనుపమ. ఆతర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగులో ఈ చిన్నది క్రేజీ ఆఫర్స్ అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇక్కడ బిజీ అయిపోయింది. అచ్చం పక్కింటి అమ్మాయిలా ఉండే అనుపమ తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. ఇక దాదాపు కుర్ర హీరోలందరితో ఈ చిన్నది జతకడుతోంది.2022 అనుపమకి బాగా కలిసొస్తోంది. ఈ ఏడాది విడుదలైన రౌడీ బోయ్స్ లో మెడికోగా మెప్పించారు అనుపమ పరమేశ్వరన్‌. ఆ సినిమాలో బబ్లీ కాలేజ్‌ గర్ల్ గా, గట్స్ ఉన్న అమ్మాయిగా మరోసారి ప్రూవ్‌ చేసుకున్నారు మల్లూ బ్యూటీ.

తాజాగా ఈ బ్యూటీ నటించిన కార్తికేయ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 13న విడుదలైంది. మొదటి షో నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కార్తికేయ సినిమాకి కొనసాగింపుగా ఇప్పుడు కార్తికేయ2తోనూ పాజిటివ్‌ టాక్‌ అందుకుంటోంది. ఈ సినిమాలో అనుపమ కేరక్టర్‌కి మంచి పేరు వస్తోంది. ముగ్ధ అనే రోల్‌ చేసింది అనుపమ. కార్తికేయ2 సినిమాను ఫస్ట్ డే మార్నింగ్‌ షో చూశారు యూనిట్‌. ఈ షోను రాజమౌళి ఫ్యామిలీ కూడా చూశారు. థియేటర్‌పార్కింగ్‌లో రాజమౌళిని చూసిన అనుపమ, వెంటనే ఆయన కాళ్లకు నమస్కారం పెట్టారు. అనుపమ నటిగానే కాదు, మలయాళం చిత్రాలకు డైరక్షన్‌ డిపార్ట్ మెంట్‌లోనూ పనిచేశారు. రాజమౌళి అంటే ఆమెకున్న గౌరవాన్ని ఇలా చాటుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి