న్యాచురల్ స్టార్ హీరో నాని (Nani) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం అంటే సుందరానికీ (Ante Sundaraniki).. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీని జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు మేకర్స్. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో అంటే సుందరానికీ నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేయగా.. మరోవైపు ఇందులోని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రమోషన్లలో వేగం పెంచిన చిత్రయూనిట్ తాజాగా అంటే సుందరానికీ ట్రైలర్ గ్లింప్స్ విడుదల చేసింది.
గ్లింప్స్ వీడియోను షేర్ చేస్తూ ఈ మూవీ ట్రైలర్ ను జూన్ 2న విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. సరదా వ్యక్తులైన సుందర్, లీల కలిసినప్పుడు వినోదం కచ్చితంగా ఉంటుంది.. అంటూ ఈ వీడియోను రిలీజ్ చేశారు. ముఖ్యమైన పాత్రలను పరిచయం చేస్తూ కామెడీ టచ్ తో కూడిన సీన్ పై ఈ గ్లింప్స్ కట్ చేశారు. కామెడీ ప్రధానంగానే ఈ సినిమా ఉండనున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. చూసింది చాలు అవతల నాకు చాలా పని ఉంది త్వరగా చెప్పు అంటూ హర్షవర్దన్ చెప్పే డైలాగ్ నవ్విస్తుంది. ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాగే మొదటిసారి నజ్రియా తెలుగులో చేస్తున్న సినిమా ఇది.. అంతేకాకుండా మొదటి సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పేస్తుంది నజ్రియా. ఇటీవల సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలో సెట్స్‌లో చోటుచేసుకున్న ఫన్నీ సంఘటనలకు సంబంధించిన వాటినన్నింటినీ ఒకచోట చేర్చి ఈ వీడియోను షేర్ చేసి సినిమా పై క్యూరియాసిటీ పెంచేస్తుంది చిత్రయూనిట్