Anchor Suma: సుమకు తప్పిన పెను ప్రమాదం.. కాలు జారి పడిన యాంకరమ్మ..

మూవీ షూటింగ్ సమయంలో సుమ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

Anchor Suma: సుమకు తప్పిన పెను ప్రమాదం.. కాలు జారి పడిన యాంకరమ్మ..
Suma

Edited By: Ravi Kiran

Updated on: May 07, 2022 | 7:01 PM

బుల్లితెర యాంకర్ సుమకు (Anchor Suma) తృటిలో పెను ప్రమాదం తప్పింది. జయమ్మ పంచాయతీ షూటింగ్ సమయంలో జరిగింది. చాలా కాలం తర్వాత సుమ ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయతీ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మే 6న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాందించుకుంది. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో సుమ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిన్న నీటి ప్రవాహం ఉన్న రాతిపై నిల్చుని పక్కనే ఉన్న రాళ్లను పట్టుకుని నీటిని చూస్తుంది. అలా నిల్చున్నప్పుడు ఆకస్మాత్తుగా ఆమె కాలు జారి పడిపోయింది. ప్రమాదం నుంచి సుమ క్షేమంగా బయటపడడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సుమ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జాగ్రత్త సుమగారు.. టేక్ కేర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

సర్కారు వారి పాట మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..  

ఇవి కూడా చదవండి

సుమ ప్రధాన పాత్రలో డైరెక్టర్ విజయ్ కుమార్ కలివరపు తెరకెక్కించిన జయమ్మ పంచాయతీ సినిమా మే6న విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో వెండితెరపై సందడి చేస్తోంది సుమ. అనారోగ్యంతో బాధపడుతున్న భర్త.. మరోవైపు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి ఓ మహిళ తీసుకున్న నిర్ణయం.. అందుకు ఏకంగా గ్రామంపైనే పోరాటానికి సిద్ధమవుతుంది. ఇందులో బలమైన ఎమోషన్స్.. డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై బలగ ప్రకాష్ నిర్మించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sundeep Kishan: సందీప్‌ కిషన్‌ పాన్‌ ఇండియా మూవీ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది.. పోస్టర్‌ మాములుగా లేదుగా..

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’కు ఏపీ సర్కారు గుడ్‌ న్యూస్‌.. టికెట్‌ ధర పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ..

Sarkaru Vaari Paata: సినిమాలో మహేశ్‌ను చూస్తే ఫ్యాన్స్ చొక్కాలు చింపుకోవాల్సిందే.. పరుశురామ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Nayanthara-Vignesh: నయన్ విగ్నేష్‌ల పెళ్లి డేట్ ఫిక్స్?.. తిరుమలలో పెళ్లి పీటలు ఎక్కనున్న జంట..