Suma Kanakala: అదిరిపోయే సర్‏ప్రైజ్ ఇచ్చిన సుమ.. వెండితెరపై సందడి చేయనున్న యాంకరమ్మ..

|

Nov 03, 2021 | 5:35 PM

బుల్లితెరపై యాంకర్ సుమకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన మాటల గారడీలతో.. అదిరిపోయే

Suma Kanakala: అదిరిపోయే సర్‏ప్రైజ్ ఇచ్చిన సుమ.. వెండితెరపై సందడి చేయనున్న యాంకరమ్మ..
Anchor Suma
Follow us on

బుల్లితెరపై యాంకర్ సుమకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన మాటల గారడీలతో.. అదిరిపోయే పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా.. టెలివిజన్ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా టాప్ యాంకర్‏గా దూసుకుపోతుంది. ఓవైపు.. రియాల్టీ షోస్.. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్‏తో బిజీ బిజీగా గడిపేస్తుంది. సుమ కేరళ అమ్మాయి అయిన.. ముందుగా తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయమైంది. సినిమాల్లో, సీరియల్లలో నటిస్తూ ఆడియన్స్‏ను అలరించింది. ఆ తర్వాత నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుని బుల్లితెరపై యాంకర్‏గా సెటిల్ అయ్యింది.

ఇదిలా ఉంటే.. గత రెండు మూడు రోజులుగా యాంకర్ సుమ వెండి తెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లుగా వార్తలు వచ్చాయి… అంతేకాకుండా.. ఈ విషయంపై సుమ స్వయంగా క్లారిటీ కూడా ఇచ్చారు.. . ఓ వీడియో ద్వారా సుమ ఈ విషయాన్ని తన స్టైల్లో చెప్పేశారు. పలువురు సెలబ్రిటీలు తన గురించి మాట్లాడిన వీడియో క్లిప్స్ కట్ చేసి ఓ వీడియో రెడీ చేసి.. ”ఇంతమంది అడుగుతున్నారంటే చేసేస్తే పోలే” అని సుమ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. యాంకర్ సుమ సినిమా ప్రకటన అధికారికంగా వచ్చేసింది.

తన ఇన్ స్టా ఖాతా ద్వారా సుమ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ఇంట్రెస్టింగ్ పోస్టర్ షేర్ చేసింది. అందులో ప్రొడక్షన్ నంబర్ 2.. టైటిల్.. ఫస్ట్ లుక్ నవంబర్ 6న విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. ఇందులో ఒక స్త్రీ చేయి కనిపిస్తుండగా..ఆ చేతిపై వెంకన్న అనే పచ్చబొట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇందులో సుమ రోల్.. నటీనటులు.. సాంకేతిక నిపుణులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి చాలా కాలం తర్వాత యాంకర్ సుమ తిరిగి వెండి తెరపైకి రీఎంట్రీ ఇస్తుంది.

Also Read: Ammu Abhiram: రోడ్డు మీద చూసి ప్రేమలో పడిపోయాను.. చివరకు సొంతం చేసుకున్నాను.. లవ్‏స్టోరీ బయటపెట్టిన నారప్ప బ్యూటీ..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట స్పెషల్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ మార్చుకున్న మహేష్..