Tollywood: చిన్నప్పడు చీరలో క్యూట్‌గా.. ఇప్పుడు మిడ్డీలో హాట్‌గా

ఓ వైపు స్టార్‌ యాంకర్‌గా అటు బుల్లితెరపై సత్తా చాటుతూనే, నటిగా వెండితెరపైనా అదరగొడుతోంది. ఈ మధ్యన ఆడియో ఫంక్షన్స్‌లోనూ తన హోస్టింగ్‌తో ఆకట్టుకుంటోంది. ఇక ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌లో రన్నరప్‌గా నిలిచి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇంతకీ తనెవరో మీరు గుర్తుపట్టారా..?

Tollywood: చిన్నప్పడు చీరలో క్యూట్‌గా.. ఇప్పుడు మిడ్డీలో హాట్‌గా
Anchor Childhood Photo

Updated on: May 10, 2024 | 12:13 PM

ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. సామాన్య జనాలు మాత్రమే కాదు.. సెలబ్రిటీస్ సైతం ఇన్ స్టా, ట్విట్టర్ వంటి వేదికల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఏదైనా అకేషన్ దొరికితే చాలు అభిమానులు వారికిష్టమైన స్టార్స్ ఫోటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమా స్టార్ల చైల్డ్‌హుడ్ ఫోటోలు మస్త్ వైరల్ అవుతున్నాయి. అలానే ప్రజంట్ తెలగునాట యమ క్రేజ్ ఉన్న ఓ బ్యూటీ చిన్నప్పటి ముద్దైన ఫోటో తెగ సర్కులేట్ అవుతోంది. మాటలతో మాయ చేస్తూ… పంచ్‌లతో నవ్వులు పూయించడం ఈమె స్పెషాలిటీ. తను హోస్ట్ చేస్తుందంటే.. సమ్‌థింగ్ స్పెషల్ అవ్వాల్సిందే. అవును.. తను యాంకర్ కమ్ యాక్ట్రస్. ఆ బూరెబుగ్గలు చూస్తే మీరు గెస్ చేయవచ్చు..? తను ఎవరో..? ఏంటి ఇంకా ఆన్సర్ పట్టలేకపోయారా..? ఇక మేమే చెప్పేస్తాం లేండి.

తను మరెవరో కాదు..  ప్రముఖ యాంకర్ శ్రీముఖి. ‘పటాస్‌’ కామెడీ షోతో యాంకర్‌గా జనాలకు దగ్గరైన ఆమె అభిమానులతో చిన్న ‘రాములమ్మ’ అని పిలిపించుకుంది. అటు షోలలో నటిస్తూనే ఇటు సినిమాల్లో కూడా తళుక్కున మెరుస్తోంది. అటు ఆడియో ఫంక్షన్స్‌లోనూ తన హోస్టింగ్‌తో మెస్మరైజ్ చేస్తోంది.  ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’లో పాల్గొని రన్నరప్‌గా నిలిచి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 2020లో ఓ ఆంగ్ల పత్రిక  ‘మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ ఆన్‌ టీవీ’ అనే పేరుతో ఆన్‌లైన్‌ పోల్‌ నిర్వహించగా.. శ్రీముఖి నంబర్‌ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఎప్పుడూ క్లాస్‌, కూల్‌ లుక్‌తో మెప్పించే శ్రీముఖి ఈ మధ్య చాలా హాట్‌ లుక్‌తో సెగలు రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ 30 ఏళ్లు కంప్లీట్ చేసుకుని.. 31వ పడిలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే తన అరుదైన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.