Anchor Lasya: తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలైన యాంకర్ లాస్య! ఏమైందోనంటూ ఫ్యాన్స్‌లో ఆందోళన

|

Sep 03, 2022 | 6:06 PM

యాంకర్ లాస్య.. బుల్లితెరపై మాటల ప్రవాహం కురిపించే ఈమె గురించి ప్రత్యేక పరిచయయం అక్కర్లేదు. ముఖ్యంగా చీమ- ఏనుగు జోక్స్‌తో ఆమె చేసే సందడి మామలుగా ఉండదు.

Anchor Lasya: తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలైన యాంకర్ లాస్య! ఏమైందోనంటూ ఫ్యాన్స్‌లో ఆందోళన
Anchor Lasya
Follow us on

Lasya Manjunath: యాంకర్ లాస్య.. బుల్లితెరపై మాటల ప్రవాహం కురిపించే ఈమె గురించి ప్రత్యేక పరిచయయం అక్కర్లేదు. ముఖ్యంగా చీమ- ఏనుగు జోక్స్‌తో ఆమె చేసే సందడి మామలుగా ఉండదు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. తన పర్సనల్‌ విషయాలతో పాటు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన వీడియోలను తరచూ షేర్‌ చేసుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా యాంకర్‌ లాస్య (Anchor Lasya) తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త లాస్య మంజునాథ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు.

లాస్య హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉండగా ఒక వీడియో తీసిన ఆయన ‘గెట్ వెల్ సూన్’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో యాంకర్ లాస్యకు అసలు ఏం జరిగింది? ఆమె ఎందుకు ఆస్పత్రిలో చేరింది? అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. . అయితే లాస్య ఆస్పత్రిలో ఎందుకు చేరిందన్న దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. మరోవైపు ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా కామెంట్లు పెడుతున్నారు. కాగా లాస్య కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతోందని, అందుకే ఆస్పత్రిలో చేరినట్లు ప్రచారం సాగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..