Anasuya Bharadwaj: ఆంటీ ఆంటీ అంటూ కుర్రాళ్ళ కేకలు.. ఇచ్చి పడేసిన అనసూయ

అనసూయ.. ఈ ముద్దుగుమ్మ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు సినిమాల్లో రాణిస్తుంది అనసూయ. జబర్దస్త్ లో తన అందంతో, డాన్స్ లతో, చలాకీ మాటలతో ప్రేక్షకులను కవ్వించింది అనసూయ ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది

Anasuya Bharadwaj: ఆంటీ ఆంటీ అంటూ కుర్రాళ్ళ కేకలు.. ఇచ్చి పడేసిన అనసూయ
Anasuya Bharadwaj

Updated on: Mar 06, 2026 | 4:38 PM

అందాల భామ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. యాంకర్ గా ఈ ముద్దుగుమ్మ స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. యాంకర్ గానే కాదు సినిమాల్లోనూ నటించి మెప్పిస్తున్నారు అనసూయ. సినిమాల్లో కీలక పాత్రలతో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేస్తూ మెప్పిస్తుంది అనసూయ. తెలుగులోనే కాదు ఆ మధ్య తమిళ్ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టారు అనసూయ. అనసూయకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాదు ఈ ముద్దుగుమ్మ తన పై వచ్చిన ట్రోల్స్ కు సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో కౌంటర్లు ఇస్తుంటారు.

మూడు పెళ్లిళ్లు.. అన్ని ఫ్లాప్..! తనకన్నా 25ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్.!!

ఇప్పటికే చాలా మందికి అనసూయ సీరియస్ వార్నింగ్ లు ఇచ్చారు. తాజాగా అనసూయ ఓ హోలీ ఈవెంట్ లో పాల్గొంది. అయితే స్టేజ్ పై అనసూయ మాట్లాడుతుంటే అక్కడున్న కుర్రాళ్లు కొందరు ఆంటీ ఆంటీ అంటూ అరుపులు, గోలలతో రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలను పలువురు షేర్ చేస్తున్నారు. అదేవిధంగా నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది రీల్స్ చేస్తున్నారు.

దిమాక్ ఖరాబ్..! ఎనిమిది మంది డైరెక్టర్లు తీశారు.. మనుషుల్నిపీక్కు తినే హారర్ మూవీ..!! ఎక్కడ చూడొచ్చంటే

కాసేపు అసహనానికి గురైనా, ఫ్రస్ట్రేషన్ బైటికి కనిపించకుండా జాగ్రత్తపడ్డారు అనసూయ. ఎలాగోలా ప్రోగ్రామ్‌ను ముగించుకుని వెనక్కి వచ్చేశారు. ఈలోగా అనసూయ-ఆంటీ వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. ఒక మహిళా సెలబ్రిటీని అగౌరవపరుస్తారా అని కొందరు, ఆంటీ అంటే తప్పేంటని కొందరు.. ఇలా రకరకాల రియాక్షన్స్‌తో కామెంట్ బాక్స్ నిండిపోయింది. కొందరైతే రీల్స్ చేసి నెట్లో వదిలారు. గతంలో కూడా అనసూయను సోషల్ మీడియాలో ‘ఆంటీ’ అని సంబోధించడం పెద్ద రచ్చకే దారితీసింది. వయసునుద్దేశించి పిలవడం సరైంది కాదని నీతులు చెప్పినా ట్రోలింగ్ కొనసాగింది. ఇప్పుడు అదే ఆంటీ సౌండ్‌ డైరెక్ట్‌గా వినాల్సిరావడం అనసూయను ఇబ్బంది పెట్టినట్టుంది. తప్పు చేసే వారిని వదిలేసి, దాన్ని ఎదురించే వారిని టార్గెట్ చేస్తారా..? అని అనసూయ పెట్టిన స్టేటస్ ట్రెండవుతోంది. ఇతరుల బాధలో కూడా వినోదాన్ని వెతికేవాళ్లను సమాజం ఊరికే వదిలిపెట్టదు.. అని శాపనార్థాలు పెడుతూ ట్రోలర్లపై మళ్లీ నైతికదాడికి దిగారు అనసూయ.

బుసకొట్టే నాగు పామును భయం లేకుండా పట్టేసుకుంది.. ఈ పాప ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us