Ananya Nagalla: అందం పెంచుకోవడానికి అనన్య అంతపని చేసిందా..? ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

|

Aug 23, 2022 | 4:00 PM

వకీల్ సాబ్ సినిమాతో కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ అనన్య నాగళ్ళ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో అనన్య నాగళ్ళ కీలక పాత్రలో నటించి మెప్పించింది.

Ananya Nagalla: అందం పెంచుకోవడానికి అనన్య అంతపని చేసిందా..? ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
Actress Ananya Nagalla
Follow us on

వకీల్ సాబ్ సినిమాతో కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ అనన్య నాగళ్ళ(Ananya Nagalla). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో అనన్య నాగళ్ళ కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఆ సినిమాలో తన అమాయకత్వంతో అందం ఆకట్టుకుంది అనన్య. ఇక ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి వరుస అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు కానీ ఈ అమ్మడు ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటోంది. నిత్యం రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది అనన్య. ఇటీవల ఈ చిన్నది గ్లామర్ డోస్ కాస్త పెంచి కిరాక్ ఫొటోలతో కిర్రెక్కిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిన్నది తాజాగా షేర్ చేసిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి.

అయితే ఈ ముద్దుగుమ్మ తన అందాన్ని పెంచుకోవడం కోసం సర్జరీ చేయించుకుందని టాక్ వినిపిస్తోంది. చూడముచ్చటగా ఉండే అనన్య తన అందాన్ని మరింత పెంచుకోవడం కోసం తన పేదలకు సర్జరీ చేయించుకుందని వార్తలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అనన్య తన పెదవులు చిన్నగా ఉన్నాయని సర్జరీ చేయించుకొని వాటి సైజ్ పెంచుకుందట. ఇప్పుడు ఇదే టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే తాజాగా అనన్య షేర్ చేసిన ఫోటోల్లో ఆమె పెదవులు పెద్దగా కనిపిస్తున్నాయి. పెదవులు లావుగా మారి తన అందాన్ని పాడు చేశాయి అని కొందరు నెటిజన్లు ఈ అమ్మడిని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం మరింత ముద్దుగా ఉంది అంటూ పొగిడేస్తున్నారు.  అయితే అనన్య నిజంగా సర్జరీ చేయించుకుందా అన్నది మాత్రం క్లారిటీ లేదు. కానీ తాజాగా చక్కర్లు కొడుతోన్న ఫొటోల్లో మాత్రం అమ్మడి పెదవులు లావుగా కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

Ananya Nagalla

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి