
టాలీవుడ్ కింగ్, నవ మన్మథుడు, ఎవర్ గ్రీన్ హీరో నాగార్జున పుట్టిన రోజు నేడు. నేటితో 68వ వసంతంలోకి అడుగుపెట్టారు నాగ్. అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా విక్రమ్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రేమకథా చిత్రాలకు నాగ్ కేరాఫ్ అడ్రస్. అలాగే ఇటు భక్తిరస చిత్రాలు అంటే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత గుర్తొచ్చే పేరు నాగార్జున. దాదాపు మూడు దశాబ్దాలుగా సినీరంగంలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు నాగార్జున. క్లాస్, మాస్ హీరోగా మెప్పిస్తూనే.. ఇటు భక్తిగీతాలు ఆలపించడం ఆయనకే సాధ్యం. తన కెరీర్ లో ఎన్నో వైవిధ్య పాత్రలతో వెండితెరపై ప్రేక్షకులను అలరించారు నాగార్జున. అమ్మాయిల కలల రాకుమారుడిగా క్లాస్ చిత్రాలతో సందడి చేసిన నాగ్.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శివ సినిమాతో మాస్ హీరోగానూ రచ్చ చేశారు.
అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో అన్నమయ్యగా.. శ్రీరామదాసుగా, షిరిడీ సాయిగా మెప్పించి ప్రశంసలు అందుకున్నారు. నాగార్జున మొదటి చిత్రం విక్రమ్.. 1986 మే 23న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. నాగ్ కెరీర్లో ఆఖరి పోరాటం, గీతాంజలి, శివ, నిన్నే పెళ్లాడతా, హలో బ్రదర్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు కింగ్ నాగార్జున విజయవంతంగా 99 సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఇక ఇప్పుడు 100వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
నాగార్జున 100వ సినిమాకు లాటరీ కింగ్ అనే ఆసక్తికర టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రా కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా నాగ్ 100వ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు అక్కినేని అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో నాగ్ మరో హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. అలాగే ఈ సినిమాలో అఖిల్, నాగ చైతన్య గెస్ట్ రోల్ లో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.
అన్నపూర్ణ స్టూడియో ..
Make way for the KING 👑
He is here to REIGN with all his STYLE, SWAG & CHARISMA 🔥🔥#KING100 Birthday Glimpse OUT NOW 🤩🤩
▶️https://t.co/VtGabd40xA#LongLiveTheKing #HBDKingNagarjunaKing @iamnagarjuna @Rakarthik_dir @ThisIsDSP @rajamahadhevan @NavinNooli @ArtSathees… pic.twitter.com/Kwvmn4SQfj
— Annapurna Studios (@AnnapurnaStdios) August 29, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.