
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సినిమా సెలబ్రిటీలు వరుసగా ఒక్కొక్కరూ పెళ్లిపీటలెక్కుతున్నారు. ఇటీవలే అనిరుధ్- కావ్య మారన్ లు గ్రీస్ వేదికగా వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ఇక సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం కూడా ఇటీవలే గ్రాండ్ గా జరిగింది. డిసెంబర్ లో ఈ మెగా హీరో వివాహం ఉండనుందని తెలుస్తోంది. అలాగే మరో హీరో తేజ సజ్జా కూడా త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. అలాగే గద్దల కొండ గణేష్ హీరోయిన్ మృణాళిని రవితో పాటు మరికొందరు సినిమా తారలు త్వరలోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నారని టాక్. ఈ క్రమంలోనే తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ కూడా సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె మరెవరో కాదు మహేష్ బాబు ‘ అతిథి ‘ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అమృతా రావు సోదరి ప్రీతికా రావు. అక్కలాగే ప్రీతి కూడా పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అయితే పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సైలెంట్ గా పెళ్లి చేసుకుంది. బెంగళూరులో తమిళ్ – బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో ప్రీతి వివాహ వేడుక జరిగింది.
తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను స్వయంగా ప్రీతినే సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఆశ్చర్యకరంగా అందులో భర్త ముఖం కనిపించకుండా బ్లర్ చేసింది. ‘గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ జీ, నా తల్లిదండ్రులు, సోదరి అమృత, బంధువులు, స్నేహితుల ఆశీస్సులతో బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రాంగణంలో నా పెళ్లి చాలా అట్టహాసంగా జరిగింది. స్వయంగా గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ జీ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం నా జీవితంలో ప్రత్యేకమైన మరుపురాని ఘట్టం. పెళ్లి అనేది వ్యక్తిగతమైన పవిత్రమైన మధురమైన అనుభూతి. అలాంటి మధురమైన క్షణాలను అందరితో పంచుకోవడం నాకు ఇష్టం లేదు’ అని రాసుకొచ్చింది ప్రీతి. ప్రస్తుతం ఈ హీరోయిన్ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ప్రీతికా రావు దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మంగళూరుకు చెందిన ప్రీతి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. 2012లో ప్రియుడు అనే చిత్రంతో తెలుగు తెరకు కూడా పరిచయమైందీఅందాల తార. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక 2019లో ఓ హిందీ సినిమాలో నటించింది. అయితే ఆ తర్వాత మరే మూవీలోనూ నటించలేదు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పాడ్ కాస్ట్ లలో కనిపిస్తోంది. అయితే ఇప్పుడు సడెన్ గా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది ప్రీతి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.