కళాతపస్వి కే విశ్వనాథ్ మరణంతో సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది. ఎన్నో ఆణిముత్యాలాంటి సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు విశ్వనాథ్. తెలుగు సినిమా స్థాయిని అప్పట్లోనే ఆకాశానికి చేర్చిన మహనీయుడు కే విశ్వనాథ్. ఎన్నో ఆణిముత్యాలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు ఆయన. శంకరాభరణం, సిరివెన్నెల, సిరి సిరి మువ్వా, సాగర సంగమం, ఆపద్బాంధవుడు, స్వాతి ముత్యం, స్వర్ణకమలం వంటి ఎన్నో అద్భుతాలను తెరకెక్కించారు విశ్వనాథ్. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. ఇటీవలే విశ్వనాథ్ కాలం చేశారు.. ఆయన మరణ వార్తను తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే విశ్వనాథ్ గతంలో ఇంటర్వ్యూల్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో కే విశ్వనాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ తరం హీరోల్లో తనకు నచ్చిన హీరో గురించి కే విశ్వనాథ్ మాట్లాడుతూ.. తనకు ఇప్పటి హీరోల్లో అల్లు అర్జున్ అంటే ఇష్టం తెలిపారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన కూడా తనకు చాలా ఇష్టమని అన్నారు.
అలాగే ఆ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొమురం భీముడో సాంగ్ చూస్తూ ఎమోషనల్ అయ్యారు విశ్వనాథ్. ఇక గురువారం(ఫిబ్రవరి 2న) రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మరణం చివరి క్షణాల వరకూ కూడా కళామతల్లి సేవలోనే గడిపారు. మరణానికి కొన్ని క్షణాల ముందు పాట రాస్తూ.. ఇక రాయలేక దానిని కుమారుడి చేతికందించి పాట పూర్తి చేయమని చెప్పారట. ఆయన రాస్తుండగానే విశ్వనాథ్ కుప్పకూలిపోయారట.