Ram Charan: చరణ్, ఉపాసన పాప కోసం అద్భుతమైన గిఫ్ట్ పంపిన అంబానీ దంపతులు.. క్లారిటీ ఇదే..

పెళ్ళైన 11 ఏళ్లకు ఉపాసన, చరణ్ దంపతులు. రామ్ చరణ్ కు కూతురు పుట్టడంతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మెగా స్టార్ చిరంజీవి మెగా వారసురాలు రావడంతో అందంతో పొంగిపోతున్నారు.

Ram Charan: చరణ్, ఉపాసన పాప కోసం అద్భుతమైన గిఫ్ట్ పంపిన అంబానీ దంపతులు.. క్లారిటీ ఇదే..
Ram Charan

Edited By:

Updated on: Jun 30, 2023 | 3:13 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జూన్ 20న ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పెళ్ళైన 11 ఏళ్లకు ఉపాసన, చరణ్ దంపతులు. రామ్ చరణ్ కు కూతురు పుట్టడంతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మెగా స్టార్ చిరంజీవి మెగా వారసురాలు రావడంతో అందంతో పొంగిపోతున్నారు. అదికూడా మంగళవారం రోజున పాప పుట్టడం తో మెగా ఫ్యామిలీ ఆనందంలో తేలిపోతున్నారు. ఇక పాప కోసం ఇప్పటికే బహుమతులు కూడా భారీగానే వస్తున్నాయి. మెగా వారసురాలి కోసం అంబానీ దంపతులు అదిరిపోయే గిఫ్ట్ ను పంపించారు.

త్వరలోనే మెగా వారసురాలి  బారసాలను జరపనున్నారట మెగా కుటుంబం. ఈ వేడుక కోసం ఇండియాలో ధనవంతుల్లో ఒకరైన అంబానీ మెగా వారసురాలి కోసం ఓ ఖరీదైన కానుకను పంపించారని తెలుస్తోంది. చరణ్ ఉపాసన దంపతులకు విషెస్ తెలుపుతూ.. అంబానీ దంపతులు ఈ బహుమతిని పంపించారట

చరణ్, ఉపాసనల పాప కోసం అంబానీ బంగారు ఊయలను గిఫ్ట్ గా ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దాని ధర సుమారు రూ. 1.20 కోట్ల పైనే ఉంటుందని.. అలాగే ఈ ఉయ్యాలా కోసం వాడిన బంగారం మొత్తం రెండు కిలోల పైనే అని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై చరణ్ టీమ్ స్పందించింది. చరణ్, ఉపాసన కూతురి బారసాల గురించి వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని.. గతంలో ఉపాసన చెప్పినట్లుగానే ప్రజ్వల ఫౌండేషన్ వాళ్లు సిద్ధం చేసిన చెక్క ఉయ్యాలనే బాలసార కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. గతంలో తన ఇన్ స్టా వేదికగా ప్రజ్వల సంస్థ వారు సిద్ధం చేసిన ఊయాల వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక చరణ్ కూతురి బారసాలకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us