Amardeep Chowdary: “ఎక్కడికి రమ్మన్నా వస్తా.. కానీ”.. దాడి పై ఫస్ట్ టైం రియాక్ట్ అయిన అమర్ దీప్

అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. అదికాస్తా పెద్దగా మారి కార్లు అద్దాలు కూడా పగలు గొట్టారు. అలాగే బస్సు అద్దాలు కూడా పగలగొట్టారు. బిగ్ బాస్ సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. అలాగే అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు. దాంతో ఫ్యాన్స్ మధ్య గట్టిగానే గొడవ జరిగింది. దాంతో పోలీస్ కేసు కూడా నమోదైంది. అయితే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ కారు పై దాడి చేశారు. 

Amardeep Chowdary: ఎక్కడికి రమ్మన్నా వస్తా.. కానీ.. దాడి పై ఫస్ట్ టైం రియాక్ట్ అయిన అమర్ దీప్
Amardeep Chowdary

Updated on: Dec 19, 2023 | 8:45 PM

బిగ్ బాస్ సీజన్ 7 కంటే ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన రచ్చ గురించే ఇప్పుడు అంత మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్ ఫినాలే రోజు బయట ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ముఖ్యంగా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. అదికాస్తా పెద్దగా మారి కార్లు అద్దాలు కూడా పగలు గొట్టారు. అలాగే బస్సు అద్దాలు కూడా పగలగొట్టారు. బిగ్ బాస్ సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. అలాగే అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు. దాంతో ఫ్యాన్స్ మధ్య గట్టిగానే గొడవ జరిగింది. దాంతో పోలీస్ కేసు కూడా నమోదైంది. అయితే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ కారు పై దాడి చేశారు.

దాంతో అమర్ దీప్ కారు అద్దాలు పగలగొట్టారు. ఆ కారులో అమర్ దీప్ భార్య, అమర్ దీప్ తల్లి ఉన్నారు. దాంతో వారికి ఎలాంటి గాయాలు జరగలేదు. అయితే తన పై జరిగిన దాడి పై మొదటి సారి స్పందించాడు అమర్ దీప్. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోలో తన పై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ.. చాలా బాధగా అనిపించింది అని అన్నాడు అమర్.

అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు పాదాభివందనం. మీలో ఒక్కడిగా నన్ను చూశారు అని అన్నాడు అమర్. గెలవలేను అనుకున్నవాడిని..గెలుపుదాకా తీసుకొచ్చి గెలిపించారు. ఇంతకు మించిన అదృష్టం లేదు. ఈ విషయంలో నేను ఫీల్ అవ్వాల్సిన లేదు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఎంటంటే.. నేను ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకోలేదు..చాలామంది నన్ను అడుగుతున్నారు..చాలా బాధలో ఉండిపోయాను అని అన్నాడు అమర్ దీప్. నా కారు అద్దాలు పగలగొట్టారు.. బయటికి రా.. నీ అంతు చూస్తాం.. అని బెదిరించారు.. నేను ఒక్కడినే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నాకేం భయం లేదు. నేను ఎవరికీ భయపడను. ఎక్కడికి రమ్మన్నా వస్తా భయపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ మన ఇంట్లో కూడా అమ్మ, అక్క, చెల్లి, భార్య ఉంటుంది. వాళ్లు మన పక్కన ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్నది ఆలోచిస్తే బాగుండాలి. కారు అద్దాలు పగలగొట్టినప్పుడు గాజు పెంకులన్నీ మా అమ్మ, భార్య తేజు మీద పడ్డాయి. లక్కీగా అవి గుచ్చుకోలేదు. ఏదైనా జరిగి ఉంటే ఈ రోజు నేను ఎవరినీ కోల్పోయేవాడినో నాకు తెలియదు. నా కుటుంబంతో సహా రోడ్డుపై నిల్చోబెట్టారు. ఆ విషయంలో చాలా బాధేసింది అంటూ బాధపడ్డాడు అమర్ దీప్. నా గురువు, నా  హీరో మాస్ మహారాజా రవితేజ గారే వచ్చి సినిమాలో అవకాశమిచ్చారు. అప్పుడే నేను గెలిచా. ఆ గెలుపుతోనే బయటికి వచ్చాను అని అన్నాడు అమర్ దీప్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..