తన పెళ్లి విషయంలో వస్తోన్న వార్తలపై స్పందించిన మెగా హీరో.. తేజ్ మాటలను సీరియస్‌గా తీసుకున్నారు అంటూ ట్వీట్.

నిహారిక వివాహం తర్వాత మెగా ఫ్యామిలో మరో పెళ్లి జరగనుందని తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వచ్చే ఏడాది ప్రారంభంలో వివాహం చేసుకోనున్నాడనేది సదరు వార్త సారాంశం.

తన పెళ్లి విషయంలో వస్తోన్న వార్తలపై స్పందించిన మెగా హీరో.. తేజ్ మాటలను సీరియస్‌గా తీసుకున్నారు అంటూ ట్వీట్.

Updated on: Dec 18, 2020 | 4:16 PM

allu sirish reacts on his marriage: నిహారిక వివాహం తర్వాత మెగా ఫ్యామిలో మరో పెళ్లి జరగనుందని తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వచ్చే ఏడాది ప్రారంభంలో వివాహం చేసుకోనున్నాడనేది సదరు వార్త సారాంశం. ఇక సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్‌తో ఈ వార్తలకు ఆద్యం పోసినట్లయింది. తన వివాహం వస్తోన్న వార్తల గురించి తేజ్ ట్వీట్ చేస్తూ.. ‘వయసులో నా కంటే శిరీష్ పెద్దవాడు, త్వరలోనే అతనికి వివాహం జరగనుంది’ అని ట్వీట్ చేశారు. దీంతో అల్లు శిరీష్ వివాహంపై చర్చ జరుగుతోంది.

దీంతో ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టకపోతే తప్పేలా లేదని భావించిన శిరీష్ తాజాగా తన పెళ్లి విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. శిరీష్ ట్వీట్ చేస్తూ.. ‘హహహా.. తేజ్ సరదాగా జోక్ చేసి ఉంటాడు. మీరు కాస్త సీరియస్‌గా తీసుకున్నారు. పెళ్లి విషయంలో మా తల్లిదండ్రలు కూడా తొందరపడటం లేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు నేనే అన్ని విషయాలు చెబుతాను’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో శిరీష్ పెళ్లిపై జరుగుతోన్న చర్చకు ఫుల్‌స్టాప్ పెట్టినట్లయింది.