Allu Arjun: ఫస్ట్ లుక్‌తోనే ఇండస్ట్రీని షేక్ చేసిన అల్లు అర్జున్.. రికార్డ్‌లన్ని బ్రేక్ అవ్వాల్సిందే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా పై భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Allu Arjun: ఫస్ట్ లుక్‌తోనే ఇండస్ట్రీని షేక్ చేసిన అల్లు అర్జున్.. రికార్డ్‌లన్ని బ్రేక్ అవ్వాల్సిందే
Allu Arjun Raaka Movie

Updated on: Apr 16, 2026 | 9:36 AM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించిన స్టార్ హీరో అల్లు అర్జున్. యాక్షన్, స్టైల్, డాన్స్ ఇలా తన ప్రతిభను చాటుతూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. కాగా అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ రాకా. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. రాకా అనే పేరు చూస్తేనే ఇది ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా అయి ఉంటుందని అర్థమవుతోంది. ఈ సినిమా కథ ఒక సామాన్య వ్యక్తి ఎలా అసాధారణ పరిస్థితుల్లో హీరోగా ఎదుగుతాడనే థీమ్‌పై ఆధారపడి ఉండవచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉండబోతుందని అంటున్నారు. గతంలో చేసిన పాత్రల కంటే ఇది మరింత మాస్ అలాగే ఇంటెన్స్‌గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఆ స్టార్ హీరోకు అక్కగా అడిగారు.. చేయనని తేల్చి చెప్పా.. అసలు విషయం చెప్పిన ఆమని

తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉండేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు అట్లీ. ఈ సినిమా నుంచి విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఎవ్వరూ ఊహించని లుక్ లో అల్లు అర్జున్ కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. కాగా సినిమాల్లో పాత్ర కోసం అల్లు అర్జున్ ఎంత సాహసమైన చేస్తారు. అలాగే సినిమాకోసం ఎంత కష్టపడాలి అంతకు మించి కష్టపడుతుంటారు. అదేవిధంగా ఈ సినిమాలో లుక్ కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారట. ఆ లుక్ కోసం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందట.. గతంలో పుష్ప లుక్ కోసం కూడా అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారు. ఇక ఇప్పుడు రాకా లుక్ కోసం అల్లు అర్జున్ ఇలా సాహసం చేస్తున్నారు. ఈ లుక్ ఖచ్చితంగా అభిమానులను థ్రిల్ చేస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్ .

అతను నా నెంబర్ బ్లాక్ చేశాడు.. జబర్దస్త్ నుంచి వచ్చేయడానికి కారణం వాళ్లే

పుష్ప , పుష్ప 2 విజయంతో అల్లు అర్జున్ పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దాంతో రాకా సినిమా కూడా అదే స్థాయిలో లేదా దానికంటే ఎక్కువగా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ క్రేజ్ ఎక్కడా తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అట్లీ. రాకా సినిమా గురించి ఇంకా పూర్తి వివరాలు త్వరలోనే రానున్నాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా బాలీవుడ్ భామ దీపికా పదుకొనె నటిస్తుంది. అలాగే మరికొంతమంది హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. వీరితో పాటు రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

కుర్రాడు భలే చేస్తున్నాడు..! ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా ఎదో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us