Allu Arjun: ఈ ట్విస్టులేంటీ బాసు.. అల్లు అర్జున్ న్యూ లుక్స్‏ చూసి మతిపోతుందంటున్న నెటిజన్స్..

|

Aug 03, 2022 | 12:36 PM

Allu Arjun: త్రివిక్రమ్, హరిష్ శంకర్ దర్శకత్వంలో ఇప్పటికే పలు యాడ్స్ షూట్ చేశారు. అయితే ఈ యాడ్ షూటింగ్స్ కు సంబంధించిన ఫోటోస్ నెట్టింట ఎప్పటికప్పుడు

Allu Arjun: ఈ ట్విస్టులేంటీ బాసు.. అల్లు అర్జున్ న్యూ లుక్స్‏ చూసి మతిపోతుందంటున్న నెటిజన్స్..
Allu Arjun 12
Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‏కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళంలోనూ బన్నీకి డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇటీవల డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో సౌత్ టూ నార్త్ ఆడియన్స్‏ను ఆకట్టుకున్నాడు బన్నీ. ముఖ్యంగా ఉత్తరాదిలో అల్లు అర్జున్‏ను అభిమానించేవారి సంఖ్య పెరిగిపోయింది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్‏గా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇందులో బన్నీ మేకవర్, స్టైల్, ఆటిడ్యూట్‏కు ఫిదా అయ్యారు నార్త్ ఆడియన్స్. ఇక ఇవన్ని పక్కన పెడితే అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 కోసం సిద్ధమవుతన్నారు. ఆగస్ట్ చివరి వారంలో ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం తనకున్న ఖాళీ సమయాన్ని తెగ ఉపయోగించేస్తున్నాడు బన్నీ. ఇటీవల ఫ్యామిలీ కలిసి ఆఫ్రిక ట్రిప్ వెళ్లిన హీరో.. ఇక ఇప్పుడు వరుస యాడ్ షూటింగ్స్ తో బిజీగా ఉంటున్నాడు. త్రివిక్రమ్, హరిష్ శంకర్ దర్శకత్వంలో ఇప్పటికే పలు యాడ్స్ షూట్ చేశారు. అయితే ఈ యాడ్ షూటింగ్స్ కు సంబంధించిన ఫోటోస్ నెట్టింట ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. అందులో బన్నీ లుక్స్ చూసి నోరెళ్లపెడుతున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ప్రతి ఫోటోలనూ బన్నీ లుక్స్ మార్చేస్తున్నాడు. ఇటీవల హరిష్ శంకర్ దర్శకత్వంలో చేసిన ప్రకటనలో బన్నీ చెవులకు పొగులు, గడ్డంతో ఊర మాస్ లుక్కులో కనిపించారు. అంతకుముందు త్రివిక్రమ్ తో కలిసి పూలరంగు చొక్కాలో స్టైలీష్ గా కనిపించారు. ఇక తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న పిక్ లో ఛార్మ్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.

Allu Arjun

డైరెక్టర్ సుకుమార్ తో కలిసి ఉన్న బన్నీ నయా ఫోటోస్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఎప్పటికప్పుడు లుక్స్ మార్చడంపై నెట్టింట కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఆ మేకోవర్స్ ఏంటీ అయ్యా.. ఒక హీరో తన 20 సినిమాలలో మర్చని లుక్స్.. బన్నీ యాడ్స్ కోసం మార్చేస్తున్నాడు..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బన్నీ నయా లుక్స్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చాలా కాలం తర్వాత సుకుమార్ తో బన్నీ కనిపించడంతో పుష్ప 2 త్వరలోనే ప్రారంభంకాబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.