
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం తన తమ్ముడు హీరో అల్లు శిరీష్ పెళ్లి పనులతో బిజీగా ఉంటున్నాడు. తన పెళ్లి రోజు అయిన మార్చి 06 నే శిరీష్ కూడా పెళ్లిపీటలెక్కాడు. నయనిక మెడలో మూడు ముళ్లు వేశాడు. తన పెళ్లి రోజును పురస్కరించుకుని భార్య స్నేహారెడ్డికి ఖరీదైన బెంజ్ ఏఎమ్‌జీ మోడల్ కారుని బహుమతిగా ఇచ్చాడు. దీని ధర సుమారు రూ.3-4 కోట్లని సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యాయి. ఇప్పుడు తల్లికి కూడా ఖరీదైన కారుని ఇచ్చాడు బన్నీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అల్లు నిర్మలకు బ్రాండ్ న్యూ లెక్సస్ కారును బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు అల్లు అర్జున్. తద్వారా అమ్మపై తనకున్న ప్రేమను, కృతజ్ఞత భావాన్ని ఈ విధంగా చాటుకున్నాడు బన్నీ. ఇక కొడుకు ఇచ్చిన ఈ ఊహించని బహుమతితో అల్లు నిర్మల ముఖంలో సంతోషం వెల్లివిరిసింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరలవుతున్నాయి. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అమ్మపై ఐకాన్ స్టార్ చూపించిన ప్రేమ అద్బుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్. హాలీవుడ్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ సినిమా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సుమారు రూ. 800 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు లోకేశ్ కనగరాజ్‌తోనూ ఓ మూవీ కమిట్ అయ్యాడు బన్నీ. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమాల నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
Two days. Two beautiful surprises. ❤️
On his wedding anniversary, Allu Arjun gifted his wife Allu Sneha Reddy a luxurious Mercedes-AMG.
And on International Women’s Day, he surprised his mother Nirmala Allu with a new Lexus.#AlluArjun pic.twitter.com/iXuVKgnGuK
— Viral Celeb X (@ViralCelebX) March 9, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.