
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప, పుష్ప 2 సినిమాలతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఐకాన్ స్టార్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్‌గా బన్నీకి క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో అభిమానుల సంఘాలు కూడా మరింత గా పెరుగుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) మహారాష్ట్రలో ఓ అడుగు ముందుకేసింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మహారాష్ట్ర రాష్ట్ర కమిటీని ముంబైలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ఏర్పాటు చేశారు. దీంతో మహారాష్ట్రలో AAFA కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయి. రాష్ట్ర కమిటీతో పాటు పరభణి, నాందేడ్, ముంబై, పుణే, పాలం, హింగోలి, ఉమ్రి, సోలాపూర్, గడ్చిరోలి, షిర్డీ జిల్లాల్లో మొత్తం 10 జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు. సామాజిక బాధ్యతలో భాగంగా AAFA ఆధ్వర్యంలో HPV పై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. HPV నివారణ, వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. మహారాష్ట్రలో AAFA నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడంతో పాటు, అభిమానులను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని కొత్తగా ఏర్పాటైన కమిటీలు పనిచేయనున్నాయి. “ప్రతి సంవత్సరం ఒక మంచి పని” అనే AAFA లక్ష్యానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలను కొనసాగించనున్నారు.
ఇప్పటివరకు వ్యక్తిగతంగా, స్థానిక స్థాయిలో బన్నీ అభిమానుల కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల కార్యకలాపాలను మరింత వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు ఈ కమిటీల ఏర్పాటు ఉపయోగపడనుందని సంఘంలోని కీలక సభ్యులు తెలిపారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిమాన హీరోపై ఉన్న ప్రేమను చాటుకున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో రాకా అనే సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్ హీరోగా. హాలీవుడ్ రేంజ్ లో సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు ఐకాన్ స్టార్. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కతోంది. త్వరలోనే ఈ మూవీస్ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
మహారాష్ట్రలో అల్లు అర్జున్ అభిమానుల సమావేశం
Big step for the Allu Arjun Fans Association (AAFA) in Maharashtra! ❤️
The Maharashtra State Committee, along with 10 district committees, has been officially formed at an event in Mumbai.
A new chapter begins. 🖤
@AAFAOnline https://t.co/XTEfA0sjPe
— Telugu70mm (@Telugu70mmweb) October 5, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.