కన్నడలో సూపర్ హిట్ అయిన “కాంతార” తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గతనెల 30న కాంతార కన్నడలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమాను ఈ నెల 15న తెలుగుతోపాటు పలు భాషల్లో విడుదలైంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కాంతార సినిమాను తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మేము రిలీజ్ చేసిన “కాంతార” చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు.ఈ సినిమా ఎం ప్రూవ్ చేసింది అంటే సినిమాకు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు కానీ ఎమోషన్ బ్యారియర్ ఒకటే మాత్రమే ఉంటుంది..ఏ ఎమోషన్ లో సినిమా తీశారో ఆ ఎమోషన్ కు కనెక్ట్ అయ్యి చేశారు అన్నారు.
ఈ కథను ఇంగ్లీష్ నుండో, యూరోపియన్ నుండో, కొరియన్ నుండో చూసి రాసుకున్న కథ కాదు వారి ఊరిలో జరిగిన కొన్ని విశేషాలను తీసుకొని రాసుకున్న కథ, ఆ ఎమోషన్ కూడా ఈయనకు మట్టిలో నుండి పుట్టిన కథ ద్వారా ఫీల్ అయ్యి చాలా చక్కగా తీశారు. బన్నీ వాసు వచ్చి నన్ను అర్జంట్ గా ఈ సినిమా చూడమంటే కన్నడలో చూశాను. ఈ సినిమా చూసిన తర్వాత విష్ణు తత్వం, రౌద్ర రూపం ఇవన్నీ కలపి వైజాగ్ దగ్గర ఉన్న మన సింహాచలంకు దగ్గరగా ఉన్న కథ అనిపించింది. ఈ సినిమాలో హీరో ఎమోషన్స్ కు ఫీల్ అయ్యి అద్భుతంగా నటించాడు అనే దానికంటే జీవించాడు అని చెప్పవచ్చు. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. జనరల్ గా నేను డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసేది చాలా తక్కువ . ఈ సినిమా చూసిన తరువాత ఇందులోని ఎమోషన్స్ కు, హీరో పెర్ఫార్మన్స్ కు ముగ్దున్ని అయ్యి ఈ సినిమాకు కనెక్ట్ అయ్యాను అన్నారు.
ఈ ఏమోషన్స్ తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను ఒక అవకాశంగా తీసుకొని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. అనుకున్నట్టే థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది.అన్ని చోట్ల నుండి ఊహించని రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది .డిఫరెంట్ ఫిలిం కావాలనుకునే వారికి “కాంతారా” సినిమా కచ్చితంగా నచ్చుతుంది. త్వరలో రిషబ్ శెట్టి మా గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడానికి ఒప్పు కున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు అల్లు అరవింద్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.