Allari Naresh : ఒకప్పుడు లవర్ బాయ్.. ఆర్యన్ రాజేశ్ సినిమాలకు దూరంగా ఉండటానికి కారణం ఇదే.. అల్లరి నరేశ్..

ఆర్యన్ రాజేష్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో. ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఈవీవీ సత్యనారాయణ పెద్ద కుమారుడు, అలాగే ప్రముఖ నటుడు అల్లరి నరేష్ అన్నయ్య. 2002లో తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన 'హాయ్' సినిమాతో ఆర్యన్ రాజేష్ హీరోగా పరిచయమయ్యారు. సొంతం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.

Allari Naresh : ఒకప్పుడు లవర్ బాయ్.. ఆర్యన్ రాజేశ్ సినిమాలకు దూరంగా ఉండటానికి కారణం ఇదే.. అల్లరి నరేశ్..
Allari Naresh, Aryan Rajesh

Updated on: May 08, 2026 | 10:31 AM

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు చాక్లెట్ బాయ్‌గా, లవర్ బాయ్‌గా అలరించిన హీరో ఆర్యన్ రాజేష్ ఎందుకు సినిమాలకు దూరంగా ఉన్నారో ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు అల్లరి నరేష్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఆర్యన్ రాజేష్ సినిమాలను పూర్తిగా వదిలేయలేదని, సరైన అవకాశం కోసం వేచి చూస్తున్నారని నరేష్ స్పష్టం చేశారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో ఏ నటుడి కెరీర్ అయినా వారి మునుపటి సినిమా సాధించిన విజయం, వసూళ్లపై ఆధారపడి ఉంటుంది. వరుసగా ఆశించిన స్థాయిలో విజయాలు అందకపోవడం వల్ల తెలియకుండానే కొంత గ్యాప్ వచ్చిందని, ఆ గ్యాప్ కాస్తా పరిశ్రమకు ఆయనను కొంచెం దూరం చేసిందని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

ఆర్యన్ రాజేష్ ప్రస్తుతం అనేక కథలు వింటున్నారు, కానీ ఆయనను ఎగ్జైట్ చేసే పాత్రలు దొరకడం లేదు. ఏదో ఒకటి చేయాలని కాకుండా, ‘ధ్రువ’ సినిమాలో అరవింద స్వామి పోషించిన పాత్రలాగా చాలా క్లాసీగా, సటిల్ విలనిజం ఉండే పాత్రలు చేయాలని ఆయన కోరుకుంటున్నారు. కేవలం ఐదు నిమిషాలు కనిపించి వెళ్ళిపోయే పాత్రలు చేయడం ఆయనకు ఇష్టం లేదని నరేష్ పేర్కొన్నారు. ఆర్యన్ రాజేష్ స్వతహాగా చాలా రిజర్వ్‌డ్, సిగ్గుపడే స్వభావం కలవారు అని అన్నారు. తనలాగా అందరితో త్వరగా కలిసిపోలేరని, ఒక వ్యక్తితో కనీసం 10-15 రోజులు ప్రయాణం చేస్తే తప్ప ఆయన ఓపెన్ అవ్వరని నరేష్ వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

ఆర్యన్ రాజేష్ సినిమాలను మానేయలేదని, కేవలం ఒక ఇంపాక్ట్‌ఫుల్ రోల్ కోసం ఎదురుచూస్తున్నారని నరేష్ స్పష్టం చేశారు. ఒక మంచి కథ, బలమైన పాత్ర లభిస్తే ఆర్యన్ రాజేష్ మళ్ళీ వెండితెరపై మెరవడం ఖాయమని ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. ప్రస్తుతం ఆయన తన తమ్ముడు నరేష్‌తో, ఇతర మిత్రులతో కలిసి హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నివసిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

Follow Us