Allari Naresh: మరోసారి సీరియస్ రోల్‌లో కనిపించనున్న నరేష్.. ‘బచ్చల మల్లి’ అనే సినిమాతో

నేను అనే సినిమాలో ఓ సైకో పాత్రలో కనిపించారు. ఆ పాత్రలో నరేష్ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత చాలా కాలానికి గమ్యం సినిమాలో నటించాడు. ఈ సినిమాలో తనదైన స్టైల్ లో కామెడీ చేస్తూనే ఎమోషన్స్ ను కూడా చక్కగా పండించాడు. ఇక నాంది సినిమాతో సీరియస్ పాత్రలోనూ మెప్పించగలనని మరోసారి నిరూపించుకున్నాడు.

Allari Naresh: మరోసారి సీరియస్ రోల్‌లో కనిపించనున్న నరేష్.. బచ్చల మల్లి అనే సినిమాతో
Bachala Malli

Updated on: Dec 01, 2023 | 4:04 PM

తన నటనతో నవ్వించగలడు, ఏడిపించగలడు అల్లరి నరేష్. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు అల్లరి నరేష్. వరుసగా కామెడీ ప్రధాన సినిమాలు చేస్తూ వచ్చిన నరేష్.. నేను అనే సినిమాలో ఓ సైకో పాత్రలో కనిపించారు. ఆ పాత్రలో నరేష్ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత చాలా కాలానికి గమ్యం సినిమాలో నటించాడు. ఈ సినిమాలో తనదైన స్టైల్ లో కామెడీ చేస్తూనే ఎమోషన్స్ ను కూడా చక్కగా పండించాడు. ఇక నాంది సినిమాతో సీరియస్ పాత్రలోనూ మెప్పించగలనని మరోసారి నిరూపించుకున్నాడు. నాంది తర్వాత ఉగ్రం అనే సినిమాతో హిట్ అందుకున్నారు. ఇట్లు మారేడు మిల్లి నియోజకవర్గం అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు.

ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నరేష్. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు పూజాకార్యక్రమాన్ని నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. నరేష్ నెక్స్ట్ సినిమాకు బచ్చల మల్లి అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఏ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

ఈ సినిమాలో నరేష్ మరోసారి సీరియస్ పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మూర్ఖత్వానికి పేరుగాంచిన పాత్రలో నరేష్ కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా 90వ దశకం నేపథ్యంలో ఉండనుందట. ఇక ఈ సినిమాలో రావు రమేష్, హరితేజ, ప్రవీణ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాను హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా మరియు బాలాజీ గుత్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.