తెలుగు వారియర్స్ మళ్లీ అదరగొట్టింది. ప్రతిష్ఠాత్మక సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2023 విజేతగా ఆవిర్భవించింది. విశాఖపట్నంలోని ఏసీఏ- వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్‌కు ధమ్కీ ఇచ్చి టైటిల్‌ను సొంతం చేసుకుంది. కెప్టెన్ అక్కినేని అఖిల్ మరోసారి సునామీ ఇన్నింగ్స్ (32 బంతుల్లో 67 పరుగులు) ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే తెలుగు వారియర్స్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ టైటిల్ గెలవడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ఫైనల్ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భోజ్‌పురి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్ తొలి ఇన్నింగ్స్‌లో అఖిల్ మెరుపు ఇన్నింగ్స్‌తో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భోజ్‌పురి దబాంగ్ 6 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. ఆ తర్వాత 58 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఖిల్ టీం కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. తద్వారా నాలుగోసారి సీసీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టోర్నీ ఆద్యంతం అదరగొట్టిన అఖిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా అఖిల్ ఎంపికయ్యాడు. కాగా సీనియర్ హీరోలు విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు తెలుగు వారియర్స్‌ను ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఎప్పటిలాగే థమన్ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు.
CHAMPIONS!!!
TELUGU WARRIORS LIFT THE CCL 2X TROPHY! @TeluguWarriors1
Congratulations!! ????? #A23 #ParleHappyHappy #a23rummy #chalosaathkhelein #letsplaytogether#CCL2023 #cricket #celebrity #cricketlovers #celebritycricketleague #cricketfever #vasavigroup @vasavigroup pic.twitter.com/bOz0JeIP35
— CCL (@ccl) March 25, 2023
#TeluguWarriors Won The #CCL2023
Champions Telugu Warriors ?
4th Consecutive Time?
A Pure Team Effort By Telugu Warriors
@ccl pic.twitter.com/h6meB7mhjs
— శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్ (@PathinaSrinu) March 26, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..