Most Eligible Bachelor: అఖిల్ సినిమా మరోసారి వాయిదా పడనుందా..? అసలు విషయం ఏంటంటే..

అక్కినేని యంగ్ హీరో అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చాలా ఇంపార్టెంట్ .. ఎందుకంటే చాలా కాలంగా అఖిల్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

Most Eligible Bachelor: అఖిల్ సినిమా మరోసారి వాయిదా పడనుందా..? అసలు విషయం ఏంటంటే..
Akhil

Updated on: Sep 25, 2021 | 8:02 PM

Most Eligible Bachelor: అక్కినేని యంగ్ హీరో అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చాలా ఇంపార్టెంట్ .. ఎందుకంటే చాలా కాలంగా అఖిల్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అఖిల్ ఎంట్రీనే స్టార్ డైరెక్టర్ వివి.వినాయక్ దర్శకత్వంలో సినిమా చేశాడు. అఖిల్ అనే  టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా  ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాపై అక్కినేని అభిమన్యులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఈ సినిమా నిరాశపరిచింది. ఆతర్వాత అక్కినేని ఫ్యామిలీకి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో హలో అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆతర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాకూడా హిట్ అందుకోలేక పోయింది. ఇక ఇప్పుడు అఖిల్-  పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్  ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాట, ఆ తర్వాత వచ్చిన రెండు పాటలు, అలాగే టీజ‌ర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్టు ఇటీవల చిత్రయూనిట్ అనౌన్స్ చేసింది. అయితే దసరాకు సినిమాల పోటీ ఎక్కువ ఉండటంతో ఈ సినిమా మరోసారి వాయిదా పడిందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 15కు వాయిదా వేశారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Konda Polam: గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన వైష్ణవ్ తేజ్ ‘కొండపోలం’.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..

Shiva Nirvana : అందమైన ప్రేమకథను సిద్ధం చేస్తున్న శివ నిర్వాణ… ఆ హీరో కోసమేనా..

Republic Pre-Release Event: ఘనంగా సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవర్ స్టార్..