హైదరాబాద్‌లో మరొక ఫిల్మ్ సిటీ .. రంగంలో దిగిన స్టార్ హీరో

హైదరాబాద్ లో అతిపెద్ద ఫిలిమ్ సిటీ రామోజీ ఫిలిం సిటీ.. ఇప్పుడు మరో ఫిలిం సిటీ నిర్మించనున్నారని తెలుస్తుంది. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓ స్టార్ హీరో ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలుస్తుంది. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.?

హైదరాబాద్‌లో మరొక ఫిల్మ్ సిటీ .. రంగంలో దిగిన స్టార్ హీరో
Film Site

Edited By: Rajeev Rayala

Updated on: Dec 01, 2025 | 8:10 PM

తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం, పర్యాటకం రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నేపధ్యంలో డిసెంబర్ 8–9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు దేశ–విదేశాల నుండి భారీ స్పందన లభిస్తోంది.

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. రిలయన్స్ గ్రూప్‌ తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్​కు చెందిన వెంటారా యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ .. నైట్ సఫారి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖలు మారనున్నాయి.

ఫుడ్‌లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్ కంపెనీ రూ.3వేల కోట్లతో ఫ్యూచర్ సిటీలో మూడు హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకోనున్నారు. ఈ కీలక ఒప్పందాలపై ఈ గ్లోబల్ సదస్సులో సంతకాలు కానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .