
సుమారు మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలికారు ఏఆర్ రెహమాన్. తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. రెహమాన్- సైరా దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు కుమార్తెలు, ఖతీజా, రహీమా, అమీన్ రెహమాన్ కొడుకు ఉన్నాడు. కాగా ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే రెహమాన్ ట్రూప్ లో బాస్ ప్లేయర్‌గా పని చేస్తోన్న లేడీ అసిస్టెంట్ మోహిని డే కూడా విడాకులు తీసుకుంది. ఆమె సంగీత స్వరకర్త మార్క్‌ను వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రెహమాన్ విడాకుల ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే మోహిని ఈ ప్రకటన చేసింది. అయితే ఇద్దరూ ఒకే రోజు విడాకులు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. విడాకుల గురించి మోహిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చింది. ‘మార్క్, నేను బాధాతప్త హృదయాలతో విడిపోతున్నాం. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మా గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి’ అని తన సోషల్ మీడియా పోస్టులో కోరింది రెహమాన్ శిష్యురాలు.
ఇక విడాకులు తీసుకున్న తర్వాత కూడా మార్క్ తో కలిసి వ్యక్తి గతంగా పనిచేస్తానని పేర్కొంది మోహిని. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ పోస్ట్ షేర్ చేసిన వెంటనే కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేసింది మోహిని.
రెహమాన్ నిర్వహించిన 40కి పైగా షోలలో పనిచేసింది మోహిని. కోల్ కతాకు చెందిన ఆమె యవసు ఇంకా ఇంకా 29 ఏళ్లు. ప్రస్తుతం, విడాకులు ప్రకటించిన పోస్ట్‌కు వారు కామెంట్ ఆప్షన్‌ను ఇవ్వలేదు. రెహమాన్ విషయానికి వస్తే, సైరా బానుతో అతని వివాహం 1995లో జరిగింది. అంటే ఇద్దరికీ పెళ్లయి 29 ఏళ్లు అయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.