
అన్నాడీఎంకే మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే రాజు.. ఇటీవల త్రిషను ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు. గతంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంప్ పెట్టినప్పుడు త్రిషను తీసుకొచ్చారని, పారితోషికం కింద 25లక్షలు ఇచ్చారని అన్నారు. డ్యాన్స్ పార్టీ, విందు కోసమే త్రిషని తీసుకొచ్చారని చెప్పారు. కువతూర్ రిసార్ట్‌లో త్రిషతో ప్రముఖులు డ్యాన్స్ పార్టీ చేసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ మాటలపట్ల అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. త్రిష ట్విట్టర్‌లో ఇప్పటికే రాజును కడిగి పారేశారు. అటెన్షన్ కోసం దిగజారి మాట్లాడే వాళ్లను చూస్తే అసహ్యం వేస్తోందంటూ కామెంట్ చేశారు.. ఇక లీగల్ నోటీసులు కూడా పంపారు.
ఏవీ రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే పరువునష్టం దావా వేస్తానని త్రిష నోటీసులు ఇచ్చారు. త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ అనుచిత వ్యాఖ్యల వివాదం ఇంకా మర్చిపోక ముందే.. పొలిటీషియన్ విమర్శలు చేయడం తమిళనాట చర్చనీయాంశమైంది. ఇకపై ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని.. వారిని కఠినంగా శిక్షించాలని ఇండస్ట్రీ ప్రముఖులంతా డిమాండ్ చేశారు. త్రిషకు మద్దతుగా నిలిచారు.
త్రిష పై పొలిటీషన్ చేసిన కామెంట్స్ పై సినీ ప్రముఖులు చాలా మంది స్పందించారు. వారిలో ముఖ్యంగా దర్శకుడు చేరన్, సముద్రఖని, నాజర్ త్రిషపై పొలిటీషన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తనకు మద్దతుగా నిలిచిన ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు అని తెలిపింది త్రిష. త్రిషపై అన్నాడీఎంకే మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే రాజు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. గతంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంప్‌కి త్రిషను తీసుకొచ్చారని ఆయన కామెంట్స్ చేశారు. ఇందుకు త్రిషకి పారితోషికం కింద రూ.25లక్షలు ఇచ్చారని కూడా చెప్పారు. డ్యాన్స్ పార్టీ, విందు కోసమే త్రిషని తీసుకొచ్చారని రాజు అన్నారు. కువతూర్ రిసార్ట్‌లో త్రిషతో ప్రముఖులు డ్యాన్స్ పార్టీ చేసుకున్నట్టు ఆయన కామెంట్స్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.