Tamannaah: సోషల్ మీడియాలో తమన్నా డ్యాన్స్ ఛాలెంజ్.. ఆ స్టెప్స్ వేయడం కష్టమే.. మీరు ట్రై చేయండి..

|

Jan 29, 2022 | 10:52 AM

మిల్కీ బ్యూటీ తమన్నాకు (Tamannaah) యూత్‏లో ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సుధీర్ఘ కాలంగా అగ్రకథానాయికగా తెలుగు చిత్రపరిశ్రమలో

Tamannaah: సోషల్ మీడియాలో తమన్నా డ్యాన్స్ ఛాలెంజ్.. ఆ స్టెప్స్ వేయడం కష్టమే.. మీరు ట్రై చేయండి..
Tamanna
Follow us on

మిల్కీ బ్యూటీ తమన్నాకు (Tamannaah) యూత్‏లో ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సుధీర్ఘ కాలంగా అగ్రకథానాయికగా తెలుగు చిత్రపరిశ్రమలో దూసుకుపోతుంది ఈ మిల్కీబ్యూటీ.. యంగ్ హీరోయిన్స్ రావడంతో అవకాశాలను అందుకోవడంలో కాస్త వెనకబడిన ఈ చిన్నది ఇప్పుడు.. మళ్లీ స్పీడ్ పెంచింది. కేవలం హీరోయిన్‏గానే కాకుండా.. ఐటెం సాంగ్స్‏తోనూ సత్తా చాటుతోంది. అంతేకాదు.. నితిన్ ప్రధాన పాత్రలో నటించిన మాస్ట్రో (Maestro) సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించింది. పూర్తి నెగిటివ్ షెడ్‏లో కనిపించి ప్రశంసలు అందుకుంది తమన్నా. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో తెగ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తమన్నా.. సోషల్ మీడియాలో సరికొత్త డ్యాన్స్ ఛాలెంజ్ తీసుకువచ్చింది.

ఇట్స్ యువర్ టర్న్ అంటూ నెట్టింట్లో ఓ వీడియోతో అందరినీ ఉత్సాహపరుస్తోంది ఈ బ్యూటీ. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న గని సినిమా తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 16న విడుదలైన కొడ్తే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ పాటకు తనలాగే పెప్పీ సాంగ్ స్టెప్ వేయాలంటూ అందరిని ఆహ్వానించింది. ఇన్‏స్టాగ్రామ్‏లో తమన్నా.. మరిన్ని అవకాశాలు తీసుకోండి.. మరిన్ని డ్యాన్స్ చేయండి.. నేను #కొడ్తే బీట్ కు డ్యాన్స్ చేస్తున్నాను. ఇది మీ వంతు అంటూ ఆ పాటకు స్టెప్పులేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం తమన్నా.. వెంకటేష్.. వరుణ్ తేజ్ కలిసి నటిస్తోన్న ఎఫ్ 3 మూవీలో నటిస్తోంది.

Also Read: Samantha: పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

Gangubai Kathiawadi: థియేటర్లలోకి గంగూబాయి కతియావాడి.. అలియా భట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ అయ్యేది అప్పుడే.. విడుదల తేది ప్రకటించిన చిత్రయూనిట్..

Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..