Tollywood : చిన్నప్పుడే తండ్రి.. వరుసగా అన్నయ్యలు చనిపోయారు.. నరకం చూసిన హీరోయిన్.. కట్ చేస్తే.. ఇప్పుడు..

ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. కానీ గ్లామరస్ ప్రపంచంలో ఆమె జీవితం అంత సాఫీగా సాగలేదు. చిన్నప్పటి నుంచే ఎంతో నరకం చూసింది. అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. పెద్దయ్యాక వరుసగా అన్నయ్యలను కోల్పోయింది. అయినప్పటికీ ఆత్మ విశ్వాసంతో సినీరంగంలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేసింది.

Tollywood : చిన్నప్పుడే తండ్రి.. వరుసగా అన్నయ్యలు చనిపోయారు.. నరకం చూసిన హీరోయిన్.. కట్ చేస్తే.. ఇప్పుడు..
Srilakshmi

Updated on: Apr 21, 2026 | 6:29 PM

ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిద్యమైన పాత్రలు పోషించింది. దశాబ్దాలుగా సినీరంగంలో తన నటనతో అలరిస్తూ తనదైన ముద్ర వేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, బాల్యం, కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనేక కష్టాలను వివరించారు. తాను అనుకోకుండానే నటిగా మారాను అని, ఇది దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. శ్రీలక్ష్మి తండ్రి అమర్‌నాథ్ తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్రశ్రేణి హీరోగా వెలుగొందారు. ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ వంటి దిగ్గజాలతో సమానంగా పేరు పొందిన అమర్‌నాథ్, 100కు పైగా చిత్రాలలో హీరోగా నటించారు. “అమర సందేశం”, “పిచ్చి పుల్లయ్య”, “చెడపకరా చెడేవు”, “చక్రపాణి” వంటి పలు విజయవంతమైన చిత్రాలలో ఆయన ప్రధాన పాత్రలు పోషించారు. అయితే, హీరోగా మాత్రమే నటిస్తాను, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయననే తన తండ్రి పట్టుదల కారణంగా, ఆయన కెరీర్ ముగిసిన తర్వాత కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. మద్రాసు నుండి హైదరాబాద్‌కు మారిన తర్వాత, అమర్‌నాథ్ డాక్యుమెంటరీలు (కుటుంబ నియంత్రణ, క్రీడల కౌన్సిల్ వంటివి) తీస్తూ వచ్చిన ఆదాయంతో తన ఆరుగురు పిల్లలతో కూడిన కుటుంబాన్ని పోషించారు. చిన్నతనంలో ఈ కష్టాలు తమకు తెలియకుండానే తమ తండ్రి తమను గారాబంగా పెంచారని శ్రీలక్ష్మి గుర్తు చేసుకున్నారు.

Read More Article: Actor : అతడికి 57.. ఆమెకు 24.. కట్ చేస్తే.. నాలుగేళ్లుగా ప్రేమలో టాలీవుడ్ విలన్..

అలాగే తన మేనకోడలు ఐశ్వర్య రాజేష్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఐశ్వర్య రాజేష్ ఎవరో కాదు, శ్రీలక్ష్మి సోదరుడు, దివంగత నటుడు రాజేష్ కుమార్తె. ఐశ్వర్య చాలా చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు. ఆ సమయంలో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది. శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ఐశ్వర్య ఈ స్థాయికి రావడానికి పడిన కష్టం సామాన్యమైనది కాదని పేర్కొన్నారు. తండ్రి చనిపోయిన తర్వాత తన ఇద్దరు అన్నయ్యలు కూడా చిన్న వయసులోనే మరణించడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసిందని అన్నారు.

Read More Article: Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే ఏదైనా చేయగలను.. రాజమౌళి కామెంట్స్..

ఒక పక్క వరుస విషాదాలు, మరోపక్క పేదరికం ఉన్నప్పటికీ ఐశ్వర్య ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆరంభంలో ఆమె రంగు గురించి, రూపం గురించి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారని గుర్తుచేసుకున్నారు. “నీకు హీరోయిన్ లక్షణాలు లేవు” అని అవమానించిన వారే ఈరోజు ఆమె నటనను చూసి గర్వపడుతున్నారని శ్రీలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు. కేవలం తన ప్రతిభను నమ్ముకుని, తమిళ , తెలుగు చిత్ర పరిశ్రమలో ఐశ్వర్య తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఎంతో కన్నీరు ఉందని ఆమె గుర్తు చేసుకున్నారు.

Read More Article: Trending : ఏం పాట మావ.. 26 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్..

ఐశ్వర్య రాజేశ్..

Read More Article: Nayanthara : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయనలాంటి డ్యాన్సర్ ఇండియాలోనే లేడు.. టాలీవుడ్ స్టార్ పై నయనతార ప్రశంసలు..

Follow Us