నాలుగు గోడల మధ్య జరిగే విషయాలు ఎవరికీ తెలియవు.. షాకింగ్ విషయం చెప్పిన స్నిగ్ధా

స్నిగ్ద .. ఈ చిన్నది టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. స్నిగ్ద అని చెప్తే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆమెను చుస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాలో నాని ఫ్రెండ్ గా నటించింది స్నిగ్ద.

నాలుగు గోడల మధ్య జరిగే విషయాలు ఎవరికీ తెలియవు.. షాకింగ్ విషయం చెప్పిన స్నిగ్ధా
Snigdha

Updated on: Dec 30, 2025 | 11:02 AM

సినిమా ఇండస్ట్రీలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాటు స్నిగ్ధా నాయ‌ని. పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ ఆమెను చూడగానే టక్కున గుర్తుపట్టేశారు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది స్నిగ్ధా. సినిమాలతో పాటు పలు టీవీ షోల్లోనూ కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది స్నిగ్ధా. ప్రస్తుతం సినిమాలు తగ్గించింది.. కానీ ఈ అమ్మడు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన సినీ కెరీర్ తో పాటు, వ్యక్తిగత జీవితం, సినీ పరిశ్రమలోని అనుభవాల గురించి పంచుకున్నారు. అలాగే పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్ల గురించి మాట్లాడింది.

ఇండస్ట్రీలో వేధింపుల గురించి మాట్లాడుతూ.. స్నిగ్ధా నాయ‌ని తనకు వ్యక్తిగతంగా ఎటువంటి వేధింపులు ఎదుర్కోలేదని స్పష్టం చేశారు. అయితే, అలాంటి సంఘటనల గురించి తాను విన్నానని, బాధితుల వేదనను అర్థం చేసుకోగలనని తెలిపింది. సినీ పరిశ్రమ ఒక గ్లాసు గోడలాంటిది, అందరికీ కనిపిస్తుంది. అందుకే దానిపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీ ఇతర రంగాలలో, నాలుగు గోడల మధ్య జరిగే విషయాలు ఎవరికీ తెలియవు. సినిమా, సీరియల్, వైద్య, ఐటీ, క్రీడా రంగాలతో సహా అన్ని రంగాలలోనూ సవాళ్లు ఉంటాయని స్నిగ్ధా చెప్పుకొచ్చింది.

స్నిగ్ధా నాయ‌ని తన ఆధ్యాత్మిక విశ్వాసం గురించి మాట్లాడుతూ.. శివుడిపై తనకు బలమైన నమ్మకం ఉందని తెలిపింది. నాకు శివుడంటే ఇష్టం. నాకు ఆయన ఫోటో చూస్తే ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. ఆయనను వరాలు అడగను, కేవలం ఆయన ఇచ్చే మంచి అనుభూతిని, శక్తిని ఇష్టపడతాను అని తెలిపింది. ఇక  వివాహం గురించి అడిగినప్పుడు, సరైన వ్యక్తి దొరికితే వివాహం చేసుకుంటానని స్నిగ్ధా నాయ‌ని స్పష్టం చేసింది. ప్రజల మాటలను తాను పూర్తిగా పట్టించుకోనని, కానీ నచ్చినవి, కొన్ని విమర్శలను తీసుకుంటాను అని తెలిపింది. తన గురించి తప్పుడు లేదా బ్యాడ్ కామెంట్స్ రాకుండా చూసుకుంటానని, తాను ఒక సాధారణ మనిషినని అన్ని ఎమోషన్స్ ఉంటాయి అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.