
తెలుగు సినిమాల్లో మెల్ కమెడియన్స్ మాత్రమే కాదు లేడీ కమెడియన్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. తమదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు కొందరు మహిళా కమెడియన్స్.. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది లేడీ కమెడియన్స్ నవ్వులు పూయించారు. అలాగే సినిమాల్లోనూ ఆకట్టుకుంటున్నారు. వారిలో సత్యశ్రీ ఒకరు. సీరియల్స్, సినిమాలతో పాటు జబర్దస్త్ లోనూ స్కిట్స్ చేసి నవ్వులు పూయించారు సత్యశ్రీ. ఇటీవలే నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు అనే సినిమాలో నటించింది సత్యశ్రీ. ఈ సినిమాలోనూ నవ్వులు పూయిస్తూ మెప్పిస్తుంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సత్యశ్రీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చమ్మక్ చంద్రతో తన సంబంధంపై వచ్చిన వదంతులు, జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి గల కారణాలు పంచుకుంది. తాను ఎప్పటికీ జబర్దస్త్ సత్యశ్రీగానే ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది. జబర్దస్త్ తనకు గొప్ప గుర్తింపునిచ్చిందని, దానికి తాను ఎప్పుడూ కృతజ్ఞురాలిగా ఉంటానని తెలిపింది సత్యశ్రీ. చమ్మక్ చంద్రతో తన సంబంధం గురించి కొన్ని రూమర్లు మీడియాలో ప్రచారం అయ్యాయని, తాము రిలేషన్‌లో ఉన్నామని, ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని వార్తలు వచ్చాయని ఇంటర్వ్యూలో అడగగా, సత్యశ్రీ వాటిని పూర్తిగా ఖండించారు. అది నిజం కాదు. నేను ఆయన్ని ఒక గురువు లెక్క చూస్తా అని స్పష్టం చేశారు.
జబర్దస్త్‌లో తనకు అవకాశం ఇచ్చింది, తన నటనకు పదును పెట్టింది చమ్మక్ చంద్రనే అని, అందుకే ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చింది. మొదట్లో తనకు నటన గురించి అంతగా తెలిసేది కాదని, జబర్దస్త్‌కి వచ్చాకే షార్ప్ అయ్యానని చంద్ర నన్ను తీర్చిదిద్దారనిచెప్పుకొచ్చింది. ఈ రూమర్ల గురించి మొదట తన తండ్రి ఓ సోషల్ మీడియాలో చూసి తనకు చెప్పారని, అయితే తన తల్లిదండ్రులు తనను నమ్మి తనకు పూర్తి మద్దతుగా నిలిచారని సత్యశ్రీ తెలిపారు. వీళ్ళ లాంటివి మా కాలంలో చాలా మందికే రాశారమ్మ. ఇదేంటి ఇది.? నా కూతురు గురించి నాకు నమ్మకం ఉంది. ఆయన మనకి తెలుసు, చంద్ర అంటే ఏంటో అనేది తెలుసు. సో నేను నమ్మను అని తన తండ్రి ధైర్యం చెప్పారని తెలిపింది. రూమర్లు వచ్చాయని తాను తప్పుకుంటే, అది నిజం చేసినట్టవుతుందని, అందుకే వాటిని పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకుంటూ పోతున్నానని తెలిపారు. చమ్మక్ చంద్ర కూడా ఈ వదంతుల గురించి తన టీమ్‌తో కలిసి నవ్వుకున్నారని, ఇలాంటివి కామన్, పెద్ద పెద్ద వాళ్ళకే వచ్చాయి. మనమెంత అసలు? ఏమీ భయపడకు అని ధైర్యం చెప్పారని సత్యశ్రీ వెల్లడించారు. జబర్దస్త్ నుండి బయటకు రావడానికి గల కారణం గురించి మాట్లాడుతూ, అక్కడ ఏదో సమస్యలు ఉన్నాయని కాదని, నాకు అవకాశం ఇచ్చిన చంద్ర గారు.. నా గురువు. ఆయన బయటికి వెళ్ళిపోయారు” కాబట్టే తాను తన టీమ్‌తో సహా బయటకు వచ్చానని సత్యశ్రీ చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.