Saranya Ponvannan: వివాదంలో చిక్కుకున్న నటి.. శరణ్య పొన్వన్నన్‌ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే.. ధనుష్ హీరోగా నటించిన రఘువరణ్ బీటెక్ సినిమాలో అమాయకపు తల్లిగా నటించి ప్రేక్షకులను అలరించారు శరణ్య పొన్వన్నన్. ఆతర్వాత చాలా సినిమాల్లో మెప్పించారు. తెలుగులో నాని గ్యాంగ్ లీడర్ సినిమాలోనూ నటించారు శరణ్య. రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాలో కనిపించారు శరణ్య. 

Saranya Ponvannan: వివాదంలో చిక్కుకున్న నటి.. శరణ్య పొన్వన్నన్‌ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
Saranya Ponvannan

Updated on: Apr 02, 2024 | 7:17 AM

శరణ్య పొన్వన్నన్‌.. తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తల్లి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పిస్తారు శరణ్య పొన్వన్నన్‌. తమిళ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు శరణ్య. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే.. ధనుష్ హీరోగా నటించిన రఘువరణ్ బీటెక్ సినిమాలో అమాయకపు తల్లిగా నటించి ప్రేక్షకులను అలరించారు శరణ్య పొన్వన్నన్. ఆతర్వాత చాలా సినిమాల్లో మెప్పించారు. తెలుగులో నాని గ్యాంగ్ లీడర్ సినిమాలోనూ నటించారు శరణ్య. రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాలో కనిపించారు శరణ్య. ఇదిలా ఉంటే ఆమె ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. పార్కింగ్ వివాదం ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది.

పార్కింగ్ విషయంలో శరణ్య పొన్వన్నన్‌ కు పక్కింటి వారితో వివాదం జరిగింది. అది కాస్త ముదిరి పోలీస్ స్టేషన్ కు చేరింది. శరణ్య పొన్వన్నన్‌ పై పక్కింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శరణ్య పొన్వన్నన్‌ తనను బెదిరిస్తుందని శ్రీదేవి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చెన్నైలోని శరణ్య నివాసముండే విరుంగబాక్కంలో పార్కింగ్‌ విషయంలో గొడవ జరిగింది. ఇప్పుడు ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో దర్యాప్తు చేస్తున్నారు. శరణ్య పొన్వన్నన్‌ తమిళ్ తో పాటు తెలుగులోనూ ఎన్నో సినిమాల్లో మెప్పించారు. రఘువరన్ బీటెక్ తో పాటు వేదం సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకున్నారు శరణ్య.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.