
ఒకప్పుడు తన గ్లామర్‌తో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది సనాఖాన్. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిన ఆమె అందం, అభినయం పరంగానూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో గగనం, కత్తి, మిస్టర్ నూకయ్య వంటి తెలుగు సినిమాల్లో నటించింది సనాఖాన్. ఇక హిందీ బిగ్‌బాస్ 6వ సీజన్‌లో పాల్గొని మరింత పాపులరైన ఆమె సల్మాన్ వంటి స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే సినిమాల్లో బిజీగా ఉండగానే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది సనాఖాన్. 2020 అక్టోబర్‌లో సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. సినిమాలకు శాశ్వతంగా దూరమవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది జరిగిన నెల రోజులకే ముస్లిం మత గురువు ముఫ్తీ అనాజ్‌ను సనా ఖాన్ పెళ్లి చేసుకుంది. దీంతో భర్త బలవంతం వల్లే ఆమె సినిమాలు మానేసిందన్న ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లపై సనాఖాన్ స్పందించింది.
‘నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం నా వివాహం. పెళ్లి తర్వాతే నేను పూర్తిగా మరో కొత్త మనిషిగా మారిపోయాను. ఆ మార్పు నేను ఎప్పటినుంచో కోరుకున్నదే. అయితే నేను ఉన్నట్లుండి సినిమాలు మానేయడం, హిజాబ్‌తోనే బయట కనిపించడం చూసి జనాలు ఏవేవో అనుకున్నారు. గతంలో హిజాబ్ లేకుండా కూడా బయట తిరిగేది.. ఇప్పుడేమో ఇంత మార్పేమిటో.. నా భర్తే నన్ను మార్చేశాడు అనుకున్నారు. కానీ, అది వాస్తవం కాదు. మన ఇష్టం లేనిదే మనల్ని ఎవరూ మార్చలేరు. నా భర్త నన్ను గైడ్ చేశాడంతే. పైగా నేను మానసిక ప్రశాంతత కోరుకున్నాను. డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఇలా ఎన్ని సంపాదించుకున్నా చివరకు మానసిక ప్రశాంతత కోరుకుంటాం కదా. నేనూ అదే దారిని ఎంచుకున్నాను’
‘సినిమా ఇండస్ట్రీలో నా చుట్టూ ఉన్నవారు సరిగ్గా లేకపోతే నేను తప్పటడుగులు వేసే ఆస్కారం ఉంది. అందుకే సినిమాలను వదిలేశాను. వీటన్నింటికన్నా నాకు నా భర్త ప్రేమ ముఖ్యమనిపించింది. సాధారణంగా పెళ్లిళ్లలో అమ్మాయి తరపు వారికే ఎక్కువ ఖర్చులుంటాయి. కానీ అందుకు భిన్నంగా నా భర్త కుటుంబమే ఎక్కువ పెళ్లి ఖర్చును భరించింది’ అని చెప్పుకొచ్చింది సనాఖాన్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..