ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది . ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ పూర్తి డీగ్లామర్ పాత్ర అయిన స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. ఆయన ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక నటిస్తోంది. ఇందులో మాలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి పోస్టర్, వీడియోస్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో స్పెషల్ సాంగ్‌లో సమంత నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆ రూమర్స్ నిజమేనంటూ తెల్చేశారు పుష్ప మేకర్స్. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో సమంత నటించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. డిసెంబర్ 17న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప రాజ్‌తో కలిసి సమంత స్టెప్పులేయనుంది. ఈ నెల 26 నుంచి నాలుగు రోజులపాటు పాట చిత్రీకరణ ఉంటుంది. దీంతో అటు బన్నీ ఫ్యాన్స్‌తో పాటు, ఇటు సామ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అలాగే ఈ సినిమా నుంచి మరో స్పెషల్ కూడా రానుంది. ఈ మూవీలోని నాలుగో పాట ‘ఏయ్ బిడ్డ ఇది నా అడ్డ’ను నవంబరు 19న రిలీజ్ చేయనున్నట్లు తెలిపుతూ ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది మూవీ టీమ్. ఇలా వరుస అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌తో ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ట్వీట్..
A big Thank You to the supremely talented @Samanthaprabhu2 garu for accepting our request and doing this sizzling number in #PushpaTheRise ?#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @anusuyakhasba @ThisIsDSP @adityamusic pic.twitter.com/fD0QRDVYTg
— Mythri Movie Makers (@MythriOfficial) November 15, 2021
Also Read: Radhe Shyam: రాధేశ్యామ్ చిత్రయూనిట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నిద్రపోతున్నావా అంటూ కామెంట్స్..