Sai Pallavi: ప్రేమ కోసం పోరాడిన వాళ్ల ఆశీర్వాదం ఉంటుంది.. సాయి పల్లవి కామెంట్స్ వైరల్..

ఇందులో రానా దగ్గుబాటి హీరోగా నటిస్తుండగా.. డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా అంచనాలను పెంచగా.. పాటలకు

Sai Pallavi: ప్రేమ కోసం పోరాడిన వాళ్ల ఆశీర్వాదం ఉంటుంది.. సాయి పల్లవి కామెంట్స్ వైరల్..
Sai Pallavi

Edited By:

Updated on: Jun 13, 2022 | 8:32 PM

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి తెలిసిన విషయమే. ఫిదా సినిమా నుంచి నిన్నటి శ్యామ్ సింగరాయ్ మూవీ వరకు ఆమె నటించిన ప్రతి మూవీ సూపర్ హిట్. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం విరాట పర్వం (Virata Parvam). ఇందులో రానా దగ్గుబాటి హీరోగా నటిస్తుండగా.. డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా అంచనాలను పెంచగా.. పాటలకు అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. జూన్ 17న ఈ సినిమా ప్రేక్షకులే ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఆదివారం వరంగల్లో విరాట పర్వం ఆత్మీయ వేడుక నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సాయి పల్లవి మాట్లాడుతూ.. వరంగల్ వస్తే నా ఇంటికి వచ్చినట్టుంది.. ఎప్పుడు వచ్చినా ఇదే ప్రేమ చూపిస్తుంటారు.. శ్యామ్ సింగరాయ్ సినిమాతో వచ్చాను..ఇప్పుడు మళ్లీ వచ్చాను.. అంత ప్రేమ చూపిస్తున్నారు. కళ లేకుండా మనం ఉండలేం.. మనం లేకుండా కళ ఉండదు.. ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగిన వాళ్ల గురించిన కథ ఇది.. నిజాయితీ ఉన్న సోట్రీ… ఇలాంటి కథను మనం ఆదరించకపోతే ఇంకెవరు ఆదరిస్తారు. జూన్ 17న వస్తోన్న ఈ సినిమాను చూడండి.. నిజం, ప్రేమ కోసం పోరాడిన వాళ్ల ఆశీర్వాదాలు ఈ సినిమాకు ఉంటాయి… ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు ఆదరించకపోతే.. ముందు వచ్చే ఇలాంటి చిత్రాలను చేసేందుకు బలం రాదు.. కొత్తగా చేస్తే ఆదరిస్తారని కోరుకుంటున్నాను.. ఇలాంటి పాత్రలు ఇచ్చింనందుకు భగవంతుడికి థ్యాంక్స్.. ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది..మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. ఇలాంటి కథల ద్వారా మీ రుణాన్ని తీర్చుకుంటాను.. అందరికీ థ్యాంక్స్ ” అని అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

Loading...
Unable to load recommendations.
Follow Us