Sai Pallavi: నువ్వేప్పుడు ప్రత్యేకమే.. అందుకే లేడీ పవర్ స్టార్ అయ్యావేమో.. ఆ కారణంతో స్టార్ హీరోస్ సినిమాలను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి ?

|

Feb 25, 2023 | 5:59 PM

కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు స్పందించలేదు సాయి పల్లవి. అటు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా సైలెంట్. ఎప్పుడో ఒక్కసారి ఫోటోస్ అప్లోడ్ చేస్తూ అభిమానుల ముందుకు వస్తుంటుంది.

Sai Pallavi: నువ్వేప్పుడు ప్రత్యేకమే.. అందుకే లేడీ పవర్ స్టార్ అయ్యావేమో.. ఆ కారణంతో స్టార్ హీరోస్ సినిమాలను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి ?
Sai Pallavi
Follow us on

తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. గ్లామర్ షోకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా.. సంప్రదాయ తెలుగింటి ఆడపిల్లగా కనిపిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటూ అందరి హీరోయిన్స్ మాదిరిగా కాకుండా ప్రత్యేక దారిలో వెళ్తుంది ఈ బ్యూటీ. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సాయి పల్లవి.. తమిళంతోపాటు.. మలయాళంలోనూ పలు సినిమాలు చేసింది. ఇటీవలే లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్న సాయి పల్లవి.. గార్గి సినిమాతో మరోసారి నటనకు ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత సాయి పల్లవి నుంచి మరో మూవీ అప్డేట్ రాలేదు. దీంతో ఆమె సినిమాలకు దూరమవుతుందని… తిరిగి చదువుపై దృష్టి పెట్టి.. డాక్టర్ స్టడీ కంప్లీట్ చేయాలని భావిస్తుందని వార్తలు వినిపించాయి. కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు స్పందించలేదు సాయి పల్లవి. అటు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా సైలెంట్. ఎప్పుడో ఒక్కసారి ఫోటోస్ అప్లోడ్ చేస్తూ అభిమానుల ముందుకు వస్తుంటుంది.

తాజాగా ఈ న్యాచురల్ బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం సాయి పల్లవి తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా ఆమె చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. అయితే ఈ క్రమంలోనే ఇటీవల ఆమె ఇద్దరు స్టార్ హీరోస్ సినిమాలను రిజెక్ట్ చేసిందట. ఆ ఇద్దరు మరెవరో కాదు.. దళపతి విజయ్, అజిత్ కావడం విశేషం. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వారిసు సినిమా కోసం రష్మిక కంటే ముందు సాయి పల్లవిని ఎంపిక చేశారట. కానీ ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేసిందట.

ఇదే కాదు.. తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన వలిమై సినిమా కోసం ముందుగా సాయి పల్లవిని అనుకున్నారట. కానీ ఇందులో హీరోయిన్ పాత్రకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో రిజెక్ట్ చేసిందట. తాను పోషించే పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేకపోయినా.. ఎంత పెద్ద స్టార్ హీరో అయిన సినిమా అయినా.. నిరాకరిస్తుంది సాయి పల్లవి. గతంలో మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా భోళా శంకర్ సినిమా కోసం సాయి పల్లవిని సంప్రదించగా.. రీమేక్ చిత్రాల్లో నటించనంటూ సున్నితంగా తిరస్కరించింది ఈ ముద్దుగుమ్మ. కేవలం రెమ్యునరేషన్.. హిట్స్ కాకుండా.. కంటెంట్.. పాత్ర ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకోవడంతో సాయి పల్లవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.