Regina Cassandra: అలాంటి విషయాల గురించి మాట్లాడాలని లేదంటున్న రెజీనా.. ప్రేమ, పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Sep 09, 2022 | 2:48 PM

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న రెజీనా.. తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తిక కామెంట్స్ చేసింది.

Regina Cassandra: అలాంటి విషయాల గురించి మాట్లాడాలని లేదంటున్న రెజీనా.. ప్రేమ, పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Regina
Follow us on

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది రెజీనా కసాండ్రా (Regina Cassandra). ఓవైపు వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ ప్లాట్‏ఫాంపై కూడా సత్తా చాటుతుంది. ఇటీవల ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టిన ఈ చిన్నది.. ప్రస్తుతం ఆమె శాకిని డాకిని సినిమాలో నటిస్తోంది. సౌత్ కొరియా యాక్షన్ కామెడీ సినిమా ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్‏గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రెజీనాతోపాటు నిదేధా థామస్ కూడా నటిస్తోంది. డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న రెజీనా.. తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తిక కామెంట్స్ చేసింది.

తన జీవితంలో ప్రేమ అనేది 2020లోనే ముగిసిందని.. దాని నుంచి బయటపడేందుకు కొంచెం సమయం పట్టిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను ఎవరినీ ప్రేమించడం లేదని తెలిపింది. అలాగే ప్రేమ, పెళ్లి విషయాలపై మాట్లాడటం తనకు ఇష్టం లేదని.. అసలు తన జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తనకే తెలియదని తెలిపింది. ఎదుటివారిపై ఆధారపడకుండా సొంతంగా జీవించడం ఎలా అనేది చిన్నతనంలోనే తన తల్లి తనకు నేర్పిందని.. జీవితంలో తోడు కావాలా ? వద్దా ? అనే విషయాలపై ఇకపై ఆలోచించనని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.