Poorna: కాబోయే భర్తను పరిచయం చేసిన పూర్ణ.. వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..

కుటుంబం, సన్నిహితుల సహాకారంతో కాబోయే భర్తతో కలిసి కొత్త అడుగు వేశానంటూ చెప్పుకొచ్చింది. తనకు కాబోయే భర్త పేరు

Poorna: కాబోయే భర్తను పరిచయం చేసిన పూర్ణ.. వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..
Poorna

Updated on: Jun 01, 2022 | 3:21 PM

అవును, సీమటపాకాయ్, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ పూర్ణ (Poorna). కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా.. పలు కీలకపాత్రలలో నటించి మెప్పించింది. ఓవైపు వెండితెరపై.. మరోవైపు బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా తన నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ. కుటుంబం, సన్నిహితుల సహాకారంతో కాబోయే భర్తతో కలిసి కొత్త అడుగు వేశానంటూ చెప్పుకొచ్చింది. తనకు కాబోయే భర్త పేరు షానిద్ అసిఫ్ ఆలీ అని తెలుపుతూ అతనితో కలిసి ఉన్న ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. పూర్ణకు అభిమానులు, నెటిజన్స్, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

పూర్ణ పెళ్లి చేసుకునే షానిద్ అసిఫ్ ఆలీ.. దుబాయ్‏లో వ్యాపారవేత్త. జేబీఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ షానిద్. గత కొద్ది రోజులుగా పూర్ణ సైతం తన కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. త్వరలో వీరి పెళ్లి తేదీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.