
ప్రముఖ నటి నివేదితా సతీశ్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. త్వరలోనే ఆమె పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా ఫొటోగ్రఫర్, వ్యాపారవేత్త సుహైబ్ మహమ్మద్‌తో నివేదిత నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా ఆమెనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మా ప్రేమ కోసం విధి ముందే రాసినట్లు ఉంది. ఇక మేము జీవితాంతం కలిసి ఉంటాం’ అంటూ క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నివేదిత- సుహైబ్ లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా నివేదిత తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన హలో (2017) సినిమాతోనే నివేదితా సతీష్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమె హీరోయిన్ ప్రియా స్నేహితురాలు కవిత పాత్రలో ఆకట్టుకుంది.
ఇక ధనుష్ హీరోగా నటించిన తమిళ పీరియాడిక్ యాక్షన్ చిత్రం కెప్టెన్ మిల్లర్(2024)లోనూ నివేదిత ఓ కీలక పాత్రలో మెప్పించింది. దీంతో పాటు పలు తమిళ చిత్రాలు, వెబ్ సిరీసుల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా నివేదిత- సుహైబ్ లది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమని తెలుస్తోంది. కాగా ఎంగేజ్మెంట్ వేడుకల్లో కాబోయే దంపతులు ఎంతో అందంగా కనిపించారు. ముఖ్యంగా నివేదిత సంప్రదాయ దుస్తుల్లో చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. ప్రస్తుతం వీరి ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన గాయత్రి శంకర్, ఆండ్రియా జెర్మియా, సంయుక్తా, ఎస్తర్ అనిల్, ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ తదితరులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
Actress #NivedhithaaSathish, known for her roles in Sillu Karupatti and Captain Miller, is now receiving appreciation for her performance in #OhButterfly 🦋
Over the last decade, she has quietly built her career by choosing meaningful and quality films. 👏✌️😍Congratulations… pic.twitter.com/8E5StSwPoz
— 𝙈𝙊𝙑𝙄𝙀 𝙏𝙄𝙈𝙀 🍿 (@moviiettime) March 10, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.