Nidhhi Agerwal: ఈ ఇస్మార్ట్ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదేనట..

|

Apr 07, 2022 | 9:02 AM

హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే ఆషామాషీ విషయం కాదు అంటున్నారు కొందరు భామలు.. ఇప్పటికే మనం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన ముద్దుగుమ్మలను చాలా మందిని చూశాం..

Nidhhi Agerwal: ఈ ఇస్మార్ట్ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదేనట..
Nidhhi Agerwal
Follow us on

హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే ఆషామాషీ విషయం కాదు అంటున్నారు కొందరు భామలు.. ఇప్పటికే మనం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన ముద్దుగుమ్మలను చాలా మందిని చూశాం.. కొంతమంది మెల్లమెల్లగా క్రేజ్ తగ్గడంతో కనుమరుగైపోయారు కూడా.. అయితే నేను అలా అవ్వను అంటుంది ఓ వయ్యారి భామ.. నిదానమే ప్రధానంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటా అని చెప్పుకొస్తుంది. ఆ బ్యూటీ ఎవరంటే.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఓ ఊపు ఊపేసిన నిధిఅగర్వాల్(Nidhhi Agerwal). నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది అందాల భామ నిధి అగర్వాల్. ఆతర్వాత అక్కినేని ఫ్యామిలీ లోనే మరో సినిమా చేసింది. అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో చేసింది నిధి. ఈ రెండు సినిమాలు అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేదు. ఆ వెంటనే వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా నిధి క్రేజ్ ను అమాంతం పెంచేసింది. పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో తన గ్లామర్ తో కట్టిపడేసింది నిధి.

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ అందాలకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ఇక ఈ వయ్యారి భామకు  ఇస్మార్ట్ తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగుతోపాటు తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా నిధికి ఆఫర్లు తలుపు తట్టాయి. అయితే నిధి మాత్రం సినిమాల విషయంలో చాలా స్లో గా ఉంటుంది. ఎక్కువ సినిమాలు కమిట్ అవ్వకుండా జాగ్రత్త పడుతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎందుకు చేయడం లేదన్న ప్రశ్న ఇటీవల అమ్మడి ముందు ఉంచితే.. నిధి ఏమంటుందంటే.. “అవకాశాలు వస్తున్నాయి .. కానీ నేనే ఒప్పుకోవడం లేదు.. వచ్చిన సినిమాలన్నీ వరుసగా చేసుకుంటూ పోతే .. క్రేజ్ తగ్గిపోతుంది. ఎంత త్వరగా క్రేజ్ వస్తుందో అంతే త్వరగా పోతుంది. కాబట్టే నిదానంగా సినిమాలు చేస్తున్నా.. హీరోయిన్ గా నిలబడాలంటే సహనం కావాలి.. మంచి పాత్రలు వచ్చే వరకు ఎదురుచూసి సినిమాలు చేయాలనీ చూస్తున్నా.. అని చెప్పుకొచ్చింది ఈ చిన్నది. ప్రస్తుతం నిధి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హరవీరమల్లు సినిమాలో నటిస్తుంది. ఏ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata : మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఫ్యాన్స్ ఖుషి..

Ante Sundaraniki: పంచెకట్టుతో అమెరికాలో చక్కర్లు కొడుతున్న నేచురల్ స్టార్..అంటే సుందరానికి.. నుంచి ఫస్ట్ సింగిల్

Hatya : మరో విభిన్నమైన కథతో రాబోతున్న వర్సటైల్ యాక్టర్.. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ‘హత్య’