Viral Photo: నగుమోము చూపని అందాల సిలక ఎవరో గుర్తుపట్టగలరా ?.. కుర్రాళ్ల మనసు దోచుకున్న దక్షిణాది ముద్దుగుమ్మ..

పైన ఫోటోను చూస్తే ఇప్పటికే మీకు అర్థమైపోయింటుంది.. పైన ఫోటోలో నగుమోము కనిపించకుండా.. పచ్చని చెట్ల వైపు చూస్తూ ఫోటోలకు ఫోజిలిస్తూ నిల్చున్న ఆ స్టైలీష్ చిన్నది ఎవరో గుర్తుపట్టండి.

Viral Photo: నగుమోము చూపని అందాల సిలక ఎవరో గుర్తుపట్టగలరా ?.. కుర్రాళ్ల మనసు దోచుకున్న దక్షిణాది ముద్దుగుమ్మ..
Actress

Updated on: May 10, 2022 | 10:12 AM

ఇప్పుడు ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలోనే తెలుస్తోంది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అవుతుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని అరచేతిలోనే ప్రపంచాన్ని చూసేస్తున్నారు. ఇంటర్నెట్ విరివిగా వాడే వారిలో సెలబ్రెటీలు సైతం అధికంగానే ఉన్నారు. తమ అభిమాన హీరోహీరోయిన్లకు.. అభిమానులకు మధ్య వారధిగా మారింది ఇంటర్నెట్.. తమకు ఇష్టమైన నటీనటులను ఫాలో కావడం.. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని నేరుగానే తెలుసుకుంటున్నారు. ప్యాన్ ఫేజీ.. హ్యాష్ ట్యాగ్ అంటూ తమ హీరోహీరోయిన్లను తెగ ట్రెండ్ చేస్తుంటారు. అంతేకాదు.. ఇటీవల చిన్ననాటి ఫోటోస్ అంటూ త్రోబ్యాక్ పిక్చర్స్ పేరుతో కొన్ని అరుదైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక వాటిని చూసేందుకు కూడా నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓ అందమైన బాపు బొమ్మ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. కానీ చిన్ననాటి పిక్ కాదండోయ్. లేటేస్ట్ ఫోటోనే. కానీ చిన్న కిటుకు ఉంది..

పైన ఫోటోను చూస్తే ఇప్పటికే మీకు అర్థమైపోయింటుంది.. పైన ఫోటోలో నగుమోము కనిపించకుండా.. పచ్చని చెట్ల వైపు చూస్తూ ఫోటోలకు ఫోజిలిస్తూ నిల్చున్న ఆ స్టైలీష్ చిన్నది ఎవరో గుర్తుపట్టండి. ఈ అమ్మడుకు దక్షిణాదిలోనే చాలా ఫాలోయింగ్ ఉంది. తమిళ్, తెలుగు, మలయాళం ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది. ఎవరో గుర్తుపట్టండి..

ఇవి కూడా చదవండి

తను మరెవరో కాదు.. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్. ఈ బ్యూటీ.. తమిళ్, మలయాళంలో పలు చిత్రాలు తీసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది. అలాగే..తమిళంలో స్టార్ హీరో ఆర్య సరసన నటించిన చిత్రం రాజా రాణి తెలుగులోకి డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతోనే తెలుగులోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని సరసన అంటే సుందరానికీ సినిమాలో నటిస్తోంది. నటిస్తోంది. నేరుగా తెలుగులో నజ్రియా చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమపై మరింత ఇంట్రెస్ట్ కలిగించాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Keerthy Suresh: షూటింగ్ టైంలో ఎప్పుడూ చూసిన రష్మిక పేరుతో పిలిచేవారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Mahesh Babu: ఆ సమయంలో నా గొంతు తడారిపోయింది.. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయాను.. మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..

Sarkaru Vaari Paata: బయటికి కనిపించని పోలీస్ కథ.. సర్కారు వారి పాట కథపై డైరెక్టర్ క్లారిటీ..

Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘ఎంత చిత్రం’ పాట

Loading...
Unable to load recommendations.
Follow Us