
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్స్ తోపాటు పెళ్లి, విడాకులు కూడా గట్టిగానే జరుగుతున్నాయి. ఇండస్ట్రీలో ఇటీవల చాలా మంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటే మరికొంతమంది విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇక ఇటీవలే ఓ హీరోయిన్ భర్తతో విడిపోతున్నట్టు అనౌన్స్ చేసింది. దాంతో ఆమె పై ఒక్కసారిగా ట్రోల్స్ తో విరుచుకుపడ్డారు నెటిజన్స్. తాజాగా తన పై వచ్చిన ట్రోల్స్ పై స్పందించింది ఆ హీరోయిన్. తనను ‘గే’ అని ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ టెలివిజన్ నటి మౌని రాయ్. టీవీ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించింది మౌని రాయ్.
మౌని రాయ్ తాను వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అయితే , దీని తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. దీంతో మౌని రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల కామెంట్ సెక్షన్‌ను ఆఫ్ చేశారు. ఈ విడాకుల విషయంలో నెటిజన్లు మౌని రాయ్ సన్నిహితురాలైన నటి దిశా పటానీని కూడా ట్రోల్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా, మౌని రాయ్, సూరజ్ నంబియార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయన్న వదంతులు వ్యాపించాయి. దీనిపై స్పందిస్తూ, ఇద్దరూ విడిపోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌని రాయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు ప్రకటించిన తర్వాత నా పై వచ్చిన లాజిక్ లేని ప్రచారం ఏదైనా ఉందంటే అది నన్ను ‘గే’ అనడమేనని ఆమె అన్నారు. అది అసత్య ప్రచారం.. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ను బేస్ చేసుకుని ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. నెగిటివిటీని నేను పెద్దగా పట్టించుకోను. విడాకుల సమయంలో నాకు అండగా నిలిచిన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉండటం నా అదృష్టం. ఇలాంటి సమయంలో నాకు లభించిన సపోర్ట్ వల్లే త్వరగా కోలుకున్నా అని తెలిపింది మౌని రాయ్.
మౌని రాయ్ ఇన్ స్టాగ్రామ్ లేటెస్ట్ పోస్ట్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి