Actress : ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన కారు.. యంగ్ హీరోయిన్ మృతి..

సినీరంగంలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యంగ్ హీరోయిన్ మరణించింది. నియంత్రణ కోల్పోవడంతో ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 30 ఏళ్ల వయసున్న యంగ్ హీరోయిన్, నటి మోడల్ మరణించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Actress : ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన కారు.. యంగ్ హీరోయిన్ మృతి..
Harshil Kalia

Updated on: Mar 25, 2026 | 10:06 AM

ప్రముఖ నటి, మోడల్ హర్షిల్ కాలియా కన్నుమూశారు. సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించినట్లు తెలుస్తోంది. ఆమె కారుపై నియంత్రణ కోల్పోయి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటన జైపూర్‌లో జరిగింది. హర్షిల్ వయసు కేవలం 30 ఏళ్లు మాత్రమే. రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో జైపూర్‌లోని షిప్రా పాత్ రోడ్డుపై హర్షిల్ ప్రమాదానికి గురయ్యారు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, హర్షిల్ కారుపై నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో కారు రోడ్డుకు అవతలి వైపునకు బోల్తా పడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న స్థానికులు స్పందించి కారులో చిక్కుకుపోయిన హర్షిల్ ను బయటకు లాగి.. చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak: అందరు హీరోలతో చేశా.. కానీ నాగార్జునతో సినిమా ఎందుకు చేయాలేదంటే.. అసలు విషయం చెప్పిన వివి వినాయక్..

ఆమెను పరీక్షించిన వైద్యులు తలకు తీవ్ర గాయం కావడంతో హర్షిల్ మరణించినట్లు తెలిపారు. కారు ప్రమాదానికి గల కచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కారు అతివేగంతో వెళ్తోందా లేక మరో కారు దాన్ని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈలోగా, హర్షిల్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood: కోటి 40 లక్షలు పెట్టి సినిమా తీశా.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగాను.. టాలీవుడ్ నటుడు..

హర్షిల్ నటన, హోస్టింగ్, మోడలింగ్ ద్వారా తన కెరీర్‌ను క్రమంగా నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె ‘క్రైమ్ నెక్స్ట్ డోర్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమైంది. ఇందులో ఆమె అనుప్రియ గోయెంకా, యష్పాల్ శర్మ, సాహిల్ వైద్, వత్సల్ షెత్‌లతో కలిసి పనిచేసింది. నటిగా ఉండటంతో పాటు, ఆమె న్యూస్ యాంకర్‌గా కూడా పనిచేసింది. హర్షిల్ పలు రాజస్థానీ మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించింది. గత కొన్ని నెలలుగా, ఆమె మోడలింగ్‌పై దృష్టి సారిస్తోంది. ఆమె ‘మిస్ దివా రాజస్థాన్ 2021’ టైటిల్‌ను, ‘మిస్ పింక్ సిటీ’ రన్నరప్ టైటిల్‌ను గెలుచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma: ఆ మహా మనిషికి తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన గొప్ప వ్యక్తి.. రామ్ గోపాల్ వర్మ..

ఎక్కువ మంది చదివినవి : Srikanth : అతడిని నమ్మి చాలా డబ్బు పోగొట్టుకున్నాను.. అందుకు కారణం ఆ ఒక్కటే.. శ్రీకాంత్..

Follow Us