
జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం AI171 అహ్మదాబాద్‌లో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతుండగా ప్రమాదానికి గురైంది. వాతావరణం కూడా పూర్తి అనుకూలంగా ఉంది. సరిగ్గా టేకాఫ్ అవుతున్నట్లు కనిపించిన విమానం కొంచెం ఎత్తుకు చేరుకున్న తర్వాత ఊహించని విధంగా ప్రమాదానికి గురయ్యింది. ఈ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని.. కాదు కాదు మొత్తం ప్రపంచాన్ని బాధలో ముంచేసింది. ఈ ప్రమాదంలో 241 మంది విమానంలో ఉన్నవాళ్లు, అలాగే విమానం కూలిన ప్రాంతంలో ఉన్న మరికొంత మంది మరణించారు.
గురువారం మధ్యాహ్నం ఆహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ (AI171) విమానం మేఘనాని నగర్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోకి కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఒక ప్రయాణీకుడు మాత్రమే అదృష్టవశాత్తు బయటపడ్డాడు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ విమానంలో నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా తన కూతురితో కలిసి ప్రయాణించారనీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ వార్తల పై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఈ మేరకు ఆమె ఇన్ స్టా స్టోరీలో వీడియో షేర్ చేసింది. నేను అందరికి పర్సనల్ గా మెసేజ్ చేశాను.. అలాగే స్టోరీ కూడా పంపించా.. నేను నా కూతురు సేఫ్ గా ల్యాండ్ అయ్యాం. తాను కూడా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేశానని తెలిపిన మంచు లక్ష్మీ.. తాను లండన్ వెళ్లలేదని.. ముంబై వెళ్ళాను అని తెలిపారు. ఈ విషయం పై చాలా మంది తనకు ఫోన్ లు, మెసేజ్ లు చేశారని.. మీ అందరి ప్రేమ వల్ల నేను, నా కూతురు క్షేమంగా ఉన్నాం అని తెలిపింది మంచు లక్ష్మీ. విమాన ప్రమాదం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంచు లక్ష్మీ. విమాన ప్రమాదం గురించి ఊహించుకుంటేనే భయంగా ఉంది అన్నారు లక్ష్మీ. కాగా ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మందితో సహా 265 మంది మరణించారు. విమాన ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని మోడీ కలిశారు. విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఆరుగురిని గుర్తించిన తర్వాత, మృతదేహాలను వారి వారి కుటుంబాలకు అప్పగించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.