Prabhas: ప్రభాస్ మామూలోడు కాదంటున్న హీరోయిన్.. మొదట్లో ఇంట్రోవర్ట్ అనుకున్నానంటూ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ మూవీతోపాటు డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్‏లోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

Prabhas: ప్రభాస్ మామూలోడు కాదంటున్న హీరోయిన్.. మొదట్లో ఇంట్రోవర్ట్ అనుకున్నానంటూ..
Prabhas

Updated on: May 24, 2025 | 10:51 AM

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన ఫ్యాన్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సలార్, కల్కి లాంటి సినిమాల తర్వాత ప్రభాస్ ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సలార్ సినిమా రూ. 700కోట్లకు పైగా వసూల్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిస్తే.. కల్కి సినిమా ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాతో రానున్నాడు ప్రభాస్. తన కెరీర్ లో ఎప్పుడూ చేయని జోనర్ లో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. మారుతి రాజాసాబ్ సినిమాను హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారు.

ఇక ఇప్పటికే నిధి అగర్వాల్, మాళవిక మోహన్ ఈ సినిమా ఈ సినిమాలో హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతున్న మాళవికామోహన్ ఇప్పటికే ప్రభాస్ గురించి, రాజా సాంగ్ షూటింగ్ గురించి పలు విషయాలను పంచుకుంది. సినిమా సెట్ లో ప్రభాస్ ఎలా ఉంటాడు, ఆయన పంపంచె ఫుడ్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి ప్రభాస్ గురించి తెలిపింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మాళవిక సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది.

ఈ క్రమంలోనే నెటిజన్ అడిగిన ప్రశ్నకు క్రేజీ సమాధానం ఇచ్చింది. ప్రభాస్ గురించి చెప్పండి అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు మహావిక సమాధానం ఇస్తూ.. ప్రభాస్ ఇంట్రోవర్ట్ అని అందరూ అనుకుంటారు.. నేను కూడా మొదట్లో అదే అనుకున్నా.. సైలెంట్ గా ఉంటాడు అనుకున్నా.. ” నేను ప్రభాస్ సర్ ని కలవడానికి ముందు ఆయన ఇంటర్వ్యూలు చూసినప్పుడు ఆయన చాలా సైలెంట్ గా, రిజర్వ్ గా ఉండేవారని అనుకున్నాను.. ఆయనను స్వయంగా కలిసినప్పుడు ఆయన సూపర్ గా మాట్లాడారు. సూపర్ ఫన్, ఫన్నీ అని, ఆయనతో సమయం గడపడానికి అందరూ ఎదురుచూస్తారు. ఆయనతో ఉంటే అస్సలు బోర్ కొట్టాదు. ఆయన చుట్టూ ఎప్పుడూ బోరింగ్ అనేదే లేదు అని చెప్పుకొచ్చింది మాళవిక. ఈ అమ్మడు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.