ఆ హీరో గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంతో ఒదిగి ఉంటారన్న లయ

ఒకానొక టైంలో తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు లయ. టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయిన తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లయ.

ఆ హీరో గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంతో ఒదిగి ఉంటారన్న లయ
Laya

Updated on: Jan 15, 2026 | 9:26 AM

చూడగానే అచ్చతెలుగు అమ్మాయిలా .. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తారు నటి లయ. తన నటనతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు లయ. గ్లామర్ కు కాకుండా కేవలం నటనకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేసి మెప్పించారు లయ. ఇక హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన లయ.. చాలా కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే నితిన్ నటించిన తమ్ముడు సినిమాలో నటించారు లయ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లయ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ, మురళీ మోహన్, రాఘవేంద్రరావు వంటి ప్రముఖులు తనతో ఇప్పటికీ టచ్‌లో ఉంటానని, తాను ఇండియాకు వచ్చినప్పుడు వారితో మాట్లాడుతుంటానని ఆమె తెలిపారు. నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటానని లయ తెలిపారు. ఇండస్ట్రీలో బాధపడిన సందర్భాలు ఉన్నప్పటికీ, వాటిని త్వరగా మర్చిపోతానని, ఎందుకంటే వాటిని గుర్తుంచుకోవడానికి ఇష్టపడనని ఆమె అన్నారు.

అలాగే లయ మాట్లాడుతూ.. పిల్లలకు ఇష్టమైన హీరోలు అల్లు అర్జున్ , మహేష్ బాబు అని లయ అన్నారు, తనకు మాత్రం అందరు హీరోలంటే ఇష్టమేనని, ఎవరినీ ప్రత్యేకంగా ఎంచుకోలేనని అన్నారు లయ. ప్రతి హీరో వారి సినిమాల్లో అద్భుతంగా నటిస్తారని ఆమె అన్నారు. తన భర్త తన సినిమాలు చూడలేదని, స్వరాభిషేకం సీడీ ఇచ్చినా అరగంటకే కట్ చేసి వెళ్లిపోయారని సరదాగా అన్నారు. తన పిల్లలు మాత్రం తన పాత సినిమాల్లోని ఏడుపు సన్నివేశాలు చూసి చిన్నతనంలో బాధపడేవారని తెలిపారు లయ.

దివంగత పునీత్ రాజ్‌కుమార్‌తో పని చేసిన అనుభవాలను లయ గుర్తుచేసుకున్నారు. పునీత్ ఎప్పుడూ ఆర్భాటం లేకుండా, చాలా నిరాడంబరంగా ఉంటారని.. ఆయన నిజమైన విలువ ఆయన మరణానంతరం అందరికీ తెలిసిందని లయ ఎమోషనల్ అయ్యారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అనే విషయాన్ని పునీత్ రాజ్‌కుమార్ జీవితం నుండి నేర్చుకోవాలని అన్నారు. డబ్బు కంటే మనుషుల ప్రేమ, ఆప్యాయతలే ముఖ్యమని లయ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.