Krithi Shetty: కస్టడీ నుంచి కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. సరికొత్త పాత్రలో బేబమ్మ..

|

Jan 18, 2023 | 12:43 PM

టీజర్‌లో నాగ చైతన్య విలన్‌లపై పంచ్‌లు, కిక్‌లు ఇస్తూ యాక్షన్‌లోకి దిగడం ఆకట్టుకుంది. ఇక ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి బేబమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.

Krithi Shetty: కస్టడీ నుంచి కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. సరికొత్త పాత్రలో బేబమ్మ..
Krithi Shetty
Follow us on

అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. న్యూఇయర్ కానుకగా విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్‏లో చైతన్య ఫెరోషియస్ అవతార్ లో కనిపించారు. టీజర్‌లో నాగ చైతన్య విలన్‌లపై పంచ్‌లు, కిక్‌లు ఇస్తూ యాక్షన్‌లోకి దిగడం ఆకట్టుకుంది. ఇక ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి బేబమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.

రెగ్యూలర్ గా కాకుండా.. కృతి శెట్టి పోస్టర్ కాస్త కొత్తగా.. ఆసక్తిగా ఉందనే చెప్పాలి. ఇందులో తన నుంచి సాలిడ్ ఎమోషన్స్ కనబరిచేలా ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ ఉంది. అయితే ఇందులో కృతి ఏ రోల్ అనేది తెలియరాలేదు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.