
బోనీ కపూర్ , దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఖుషీ కపూర్ ఇటీవలే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా, ఖుషీ కపూర్ ఇదే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఖుషీ కపూర్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఖుషీ కపూర్ తన అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది.
ఖుషీ కపూర్ ఆర్చీస్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం 7 డిసెంబర్ 2023న విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి భారీగా ప్రమోషన్లు జరిగాయి. ఖుషీ కపూర్ ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో కనిపించింది. ఖుషీతో వేదంగ్ రైనా డేటింగ్ చేస్తున్నాడని బజ్ ఉందని కరణ్ జోహార్ అన్నారు. ఇప్పటికే అక్క జాన్వీ కపూర్ శిఖర్ పహారియా డేటింగ్ఈ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు చెల్లి ఖుషి కూడా ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉంది.అయితే ఖుషీ కపూర్ కరణ్ జోహార్‌కి బాంబ్‌స్టిక్ రిప్లై ఇచ్చింది. ఖుషీ కపూర్ చెప్పిన సమాధానం అందరిని షాక్ కు గురిచేసింది. ఖుషీ కపూర్ చాలా డిఫరెంట్ గా సమాధానం చెప్పింది.
ఖుషీ మాట్లాడుతూ, “ఓం శాంతి ఓమ్‌లో ఓం, నేనూ మంచి స్నేహితులం అని చెప్పుకునే సన్నివేశం మీకు తెలుసా?” అని సమాధానం ఇచ్చింది. ఖుషీ మాటలు విని అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు ఇదే ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది ఆర్చీస్ చిత్రం తర్వాత, ఖుషీ కపూర్, వేదంగ్ రైనా డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇద్దరిలో ఎవరూ స్పందించలేదు. ఖుషీ కపూర్, వేదంగ్ రైనా తరచుగా కలిసి తిరగడం మీడియా కంటపడింది. వేదంగ్ రైనా మరియు ఖుషీ కపూర్ డేటింగ్ లో ఉన్నారంటూ బీటౌన్ కోడై కూస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.