
ప్రస్తుతం హీరోయిన్ కీర్తి సురేష్ వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ఇటీవలే మహేష్ సరసన సర్కారు వారి పాట చిత్రంలో కళావతి పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా తెలుగు, తమిళ చిత్రాలు విజయం సాధించడంతో అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ నోట్ షేర్ చేసింది.

సర్కారు వారి పాట, చిన్ని సినిమాలను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు.. అభిమానులకు ధన్యవాదలు తెలిపింది కీర్తి సురేష్... అలాగే మహేష్ బాబుతోపాటు.. తనతోపాటు వర్క్ చేసిన చిత్రయూనిట్లకు కృతజ్ఞతలు తెలిపింది.

నటిగా ఉండడం అంత సులభమైన విషయం కాదు.. ఎన్నో ఆటుపోట్లు చూడాల్సి ఉంటుంది.. నేనెంటో నిరూపించుకుంటున్నాను.. ఈరోజు నా సంతోషాన్ని మీతో పంచుకోవడానికి ఇలా మీ ముందుకు వచ్చాను.. నేను నటించిన సర్కారు వారి పాట, చిన్ని సినిమాలను ఆదరించినందుకు ధన్యవాదాలు.

నన్ను నిరంతరం దగ్గరుండి సపోర్ట్ చేసినందకు నమ్రతకు ధన్యవాదాలు. అలాగే మహేష్ బాబు..మీతో కలిసి నటించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను.. మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.. ఈ విజయానికి కృషి చేసిన టీమ్ అందరికీ అభినందనలు..

ఇక నా అభిమానులు నా బలం. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీరే.. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు..

అలాగే నా ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన దర్శకులకు ధన్యవాదాలు.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నేను నా పరిధిని విస్తరించుకుంటూ ధైర్యంగా ముందుకు వెళతాను.. అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.

ప్రస్తుతం ఈ అమ్మడు న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న దసరా సినిమాలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లెలిగా నటిస్తోంది.