
సీరియల్స్ ద్వారా ముజాన్సీ క్రేజ్ సొంతం చేసుకుంది అందాల భామ కీర్తి భట్. ఆతర్వాత బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొంది ఈ అందాల తార. గతంలో ఓ ఇంటర్వ్యూలో కీర్తి భట్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. కీర్తి భట్ మాట్లాడుతూ తన బ్రేకప్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. తాను మొదట్లో అంత సులభంగా ఎవరినీ నమ్మే వ్యక్తిని కానని, కానీ ఆ వ్యక్తి పట్టుదలగా తనను ఫాలో అయ్యి, తన తల్లిదండ్రులను ఒప్పించి, తనను ప్రేమించమని కోరడంతో ఒకే చెప్పా అని తెలిపింది. వారి ప్రేమ పెళ్లి ప్రపోజల్ వరకు వెళ్లిందని తెలిపింది. తాను తన మాజీ ప్రియుడి ఆదాయం గురించి గానీ, అతని ఇల్లు చిన్నదని గానీ ఎప్పుడూ ఆలోచించలేదని ఆమె తెలిపింది. ఇద్దరూ కలిసి కష్టపడితే మంచి జీవితాన్ని, పెద్ద ఇంటిని నిర్మించుకోవచ్చని గట్టిగా నమ్మాను అని తెలిపింది.
అయితే, కాలక్రమేణా వారి సంబంధం దారుణంగా మారిందని కీర్తి భట్ ఆవేదన వ్యక్తం చేసింది. సీరియల్ నటిగా తాను ఇతర నటులతో కలిసి షోలకు వెళ్లడం, డ్యాన్స్ చేయడం, రీల్స్ చేయడం వంటివి తన వృత్తిలో భాగమని, కానీ తన మాజీ ప్రియుడు, అతని తల్లి తనపై అనుమానం పెంచుకోవడం ప్రారంభించారని ఆమె తెలిపారు. ఈ నిరంతర అనుమానాలతో నరకం అనుభవించా అని ఆమె తెలిపింది. అతను ఒక సీరియల్‌లో సహాయక పాత్ర పోషిస్తూ నెలకు రూ.8,000-12,000 మాత్రమే సంపాదిస్తుంటే, తాను ప్రధాన పాత్రలో నటిస్తూ మంచి పారితోషికం అందుకుంటున్నానని తెలిపింది.
బ్రేకప్ అయ్యే సమయంలో తన మాజీ ప్రియుడు సైకో లాగా ప్రవర్తించాడని, తన తల్లి మాటనే విన్నాడని, తన పక్షాన నిలబడలేదని కీర్తి భట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన గురించి అతని తల్లి తప్పుగా చెప్పినప్పుడు కూడా, తాను అలాంటి అమ్మాయిని కాదని అతను చెప్పలేదని కీర్తి తెలిపింది. బిగ్ బాస్ షోకు వెళ్ళడానికి 10 రోజుల ముందు తన పాప చనిపోయిందని, అప్పుడే తన ప్రేమ కూడా బ్రేకప్ అయిందని కీర్తి భట్ ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని రోజులకే, తన మాజీ ప్రియుడి కుటుంబం తన చనిపోయిన పాపకు డీఎన్‌ఏ పరీక్ష అడిగిందని, అది వారిదే అయి ఉండొచ్చని అన్నారని ఆమెకు తెలిసింది. ఈ విషయం తనను ఎంతగానో బాధించిందని, తాను ఈ విషయం గురించి ఏడ్చానని పేర్కొన్నారు. అంతేకాకుండా, తాను తన మాజీ ప్రియుడిని డబ్బు అడిగానని తప్పుడు ఆరోపణలు చేశారని, తన లక్షల్లో సంపాదిస్తున్నప్పుడు రూ.12,000 సంపాదించే వ్యక్తిని ఎందుకు అడుగుతానని ఆమె చెప్పుకొచ్చింది. కర్మ తిరిగి వస్తుందని తాను గట్టిగా నమ్ముతున్నానని, తాను వృత్తిపరంగా ఎదిగినా, అతను మాత్రం ఇప్పటికీ అదే సహాయక పాత్రలో ఉన్నాడని ఆమె అన్నారు. తన జీవితం చాలా బాగుందని, మంచి మార్గంలో వచ్చిందని కీర్తి భట్ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.